ఆంధ్రప్రదేశ్‌

ఆత్మగౌరవానికి, అహంకారానికి మధ్య పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 29: నంద్యాలలో ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికలు ప్రజల ఆత్మగౌరవానికి, టిడిపి అహంకారానికి మధ్య జరుగుతున్న పోరని వైకాపా ఎమ్మెల్యే రోజా అన్నారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ టిడిపి మంత్రులపైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎత్తు పెరిగిన మంత్రి అచ్చన్నాయుడికి కొంచెం కూడా బుద్ధి పెరిగినట్లు కనిపించడంలేదని రోజా అన్నారు. కులం పేరుతో రాజకీయాలు చేసిన వారిని చెప్పుతో కొట్టాలన్న ఆయన 2014 ఎన్నికల నుంచి కులరాజకీయాలు చేస్తున్న ముఖ్యమంత్రిని దేంతో కొట్టాలని ప్రశ్నించారు. టిడిపి మ్యానిఫెస్టోలోని 21,22,23 పేజీల్లో ఇచ్చిన హామీలు మొత్తం కుల చిచ్చు పెట్టేవేనని అన్నారు. ఆగస్ట్ మూడున వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నంద్యాలకు వస్తున్నారని అప్పుడే టిడిపి మంత్రుల ప్రశ్నలకు సమాధాన మిస్తారని ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు.
డ్రగ్స్ వ్యవహారంపై స్పందిస్తూ సినీ పరిశ్రమలో కేవలం ఆరుగుర్నిమాత్రమే సిట్ విచారించడమేమిటన్నారు. సినీ ఇండస్ట్రీలోకన్నా నేడుపాఠశాలలు, కళాశాలల్లోనే మత్తుపదార్థాల వాడకం ఎక్కువగా ఉందని అన్నారు. దీనిని విజిలెన్స్ అధికారులు, ప్రభుత్వం గుర్తించడంలేదని తెలిపారు. అయితే సినీ పరిశ్రమలోని ఆ ఆరుమందే తప్పు చేసినట్లు వారిని విచారించడం, దొంగలుగా చిత్రీకరించడం సరికాదన్నారు.