ఆంధ్రప్రదేశ్‌

రద్దయిన నోట్ల మార్పిడి ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం అర్బన్, జూలై 29: రద్దయిన నోట్లు మార్చేందుకు యత్నిస్తున్న కడప, అనంతపురం జిల్లాలకు చెందిన ముఠా సభ్యులను అనంతపురం జిల్లా పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. 11 మంది సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు వీరి నుంచి రద్దయిన రూ.కోటి నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం నగరంలో శనివారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో అదనపు ఎస్పీ మల్యాద్రి ముఠా వివరాలు వెల్లడించారు. కడప జిల్లాకు చెందిన ముఠాలోని కీలక నిందితుడు ఎస్.పవన్‌కుమార్‌రెడ్డితో పాటు, ఎస్.శ్రావణ్‌కుమార్‌రెడ్డి, ఎస్.రామిరెడ్డి, జి.మహేశ్వర్‌రెడ్డి, పి.చంద్రశేఖర్, షేక్ సత్తర్ బాషా, అనంతపురం జిల్లాకు చెందిన డి.ఉత్తప్ప, కె.అంకిరెడ్డి, ఎం.సత్యమయ్య, ఎన్.రామానాయుడు, షేక్ అబీబ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పవన్‌కుమార్‌రెడ్డి ఎలాంటి శ్రమ లేకుండా డబ్బు సంపాదించాలన్న ఆశతో ప్రభుత్వం రద్దుచేసిన పాత నోట్లను మారుస్తూ కమీషన్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో రామిరెడ్డి, ఉత్తప్ప, మహేశ్వర్‌రెడ్డి, చంద్రశేఖర్, సత్తర్ బాషాతో ముఠా ఏర్పాటుచేశాడు. పరిచయస్తులు, బ్యాంకులు, పోస్ట్ఫాసులు, ఫైనాన్స్ సంస్థల వద్ద ఉన్న రద్దయిన పాతనోట్లు తీసుకుని కమిషన్ తీసుకుని మార్పిడి చేసేవాడు. ఈ క్రమంలో కడప జిల్లా ముద్దనూరులోని ఆర్టీపీపీలో ఎఇగా పనిచేస్తున్న రామకృష్ణారెడ్డి తన వద్ద ఉన్న రూ.కోటి రద్దయిన నోట్లు మార్చాలని పవన్‌కుమార్‌రెడ్డికి అప్పగించాడు. గుంతకల్లుకు చెందిన బాషాతో రూ.25 లక్షల కొత్త నోట్లు ఇచ్చేలా బేరం కుదుర్చుకున్నారు. దీంతో తన అనుచరుల ద్వారా పవన్ పాత నోట్లు అనంతపురం పంపించగా సమాచారం అందుకున్న పోలీసులు అరెస్టుచేశారు. వీరి నుంచి రద్దయిన రూ.కోటి పాత నోట్లు, స్కార్పియో, మోటార్‌సైకిళ్లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.