ఆంధ్రప్రదేశ్‌

అవన్నీ వదంతులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూలై 29: యాభై సంవత్సరాలు నిండిన ప్రభుత్వ ఉద్యోగులు పనితీరులో వెనుకబడితే విధుల తొలగిస్తామని జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఉద్యోగులు నమ్మవద్దని, ఇది కేవలం ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ కుట్రలో భాగమేనని రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో తమ ప్రభుత్వం తొలి నుండి చిత్తశుద్ధితో కృషి చేస్తోందని చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో శనివారం ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పతో కలసి యనమల విలేఖరులతో మాట్లాడారు. గడచిన మూడేళ్లకాలంలో ఉద్యోగులకు ఇచ్చిన అన్ని హామీలను అమలుచేశామన్నారు. ముఖ్యంగా 10వ పిఆర్‌సిలో భాగంగా ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ను ఇచ్చామని, దీని వలన ప్రభుత్వంపై 7వేల కోట్ల అదనపు భారం పడిందన్నారు. గతంలో ఏ ప్రభుత్వంలోనూ ఉద్యోగులకు ఫిట్‌మెంట్ 21 శాతం దాటి ఇచ్చిన దాఖలాల్లేవని చెప్పారు. అధికారంలోకి రాగానే ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58నుండి 60 సంవత్సరాలకు పెంచిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఉద్యోగులకు బకాయి పడిన రెండు డి ఎలను ఈ సంవత్సరాంతంలోగా ఇస్తామని మంత్రి హామీనిచ్చారు. రాజధాని అమరావతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు గృహ నిర్మాణం నిమిత్తం 10 లక్షల రూపాయలను హడ్కో రుణం కింద మంజూరు చేయనున్నట్టు తెలిపారు. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు ఆయా సంస్థల ఆదాయం ఆధారంగా పదవీ విరమణ వయసు పెంచుకునే అవకాశం కూడా కల్పించామన్నారు. గడచిన మూడేళ్ల కాలంలో 12వేల 552 ఉద్యోగాలను వివిధ రూపాల్లో కల్పించామని చెప్పారు. 6వేల ఉద్యోగాలను ఉన్నత గ్రేడ్‌కు పెంచామని, ఉద్యోగుల శ్రేయస్సే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. కులాలు, ప్రాంతాల వారీగా ఇప్పటికే వైసిపి అధినేత జగన్ చిచ్చు పెట్టారని, ఇపుడు ఉద్యోగుల్లో అభద్రతాభావాన్ని కల్పించేందుకు కుట్ర పన్నారని విమర్శించారు. ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లో ఆందోళన చెందాల్సిన పని లేదని, ఇబ్బందులను అధిగమిస్తూనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఉద్యోగుల తొలగింపునకు సంబంధించి ప్రభుత్వం సిద్ధం చేసిందంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని, ప్రతిపక్ష మీడియా ఈ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ఇందుకు సంబంధించి సాక్షి పత్రికపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు.