ఆంధ్రప్రదేశ్‌

రహదారిపై యుద్ధ విమానాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 30: భారత వాయుసేనకు చెందిన యుద్ధ విమానాలు అత్యవసర పరిస్థితుల్లో ల్యాండింగ్‌కు వీలుగా కొన్ని జాతీయ రహదారులను అభివృద్ధి చేయనున్నారు. విమానం దిగేందుకు వీలుగా రహదారిలో కొంతభాగాన్ని ఎయిర్ స్ట్రిప్‌గా అభివృద్ధి చేస్తారు. సహాయక చర్యలు, తదితర అత్యవసర పరిస్థితుల్లో యుద్ధ విమానాలు దిగేందుకు వీలుగా 24 జాతీయ రహదారులను భారత వాయుసేన ఎంపిక చేసింది. తొలిదశలో 12 రహదారులను ఎయిర్ స్ట్రిప్‌లుగా అభివృద్ధి చేసేందుకు నిర్ణయం తీసుకుంది. తొలిదశలో ఎంపిక చేసిన వాటిలో విజయవాడ- రాజమండ్రి రహదారి కూడా ఉంది. ఎహెచ్-45ను యుద్ధ విమానాల ల్యాండింగ్‌కు వీలుగా ఎంపిక చేశారు. ఎహెచ్-45 ఆరులేన్ల రహదారి కావడం, ఫ్లైవోవర్లను తగినంత మందంగా నిర్మించడం వంటి కారణాలతో ఈ రహదారిని ఎంపిక చేశారు. విమానాల ల్యాండింగ్‌కు వీలుగా రహదారుల ఎంపికకు వాయుసేన భారీ కసరత్తు చేసింది. నక్సల్ ప్రభావిత ప్రాంతాలు, ఇతర కోస్తా ప్రాంతాలను కలిపే రహదారులను ఎంపిక చేశారు. ఇప్పటికే రాజమండ్రి, విజయవాడల్లో విమానాశ్రయాలు ఉన్నప్పటికీ, ఈ రెండు నగరాల మధ్య ప్రాంతాన్ని ఎంపిక చేయడంలో వ్యూహాత్మంగా వ్యవహరించారని తెలుస్తోంది. పోలవరం, రంపచోడవరం గిరిజన ప్రాంతాలను, కోనసీమను దృష్టిలో ఉంచుకుని ఈ రహదారిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. యుద్ధ విమానాలు దిగేందుకు గరిష్టంగా 500 మీటర్ల ఎయిర్ స్ట్రిప్ సరిపోతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ల్యాండింగ్‌కు ఎంపిక చేసిన ప్రాంతంలో డివైడర్లు, మధ్యలో విద్యుత్ స్తంభాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.