ఆంధ్రప్రదేశ్‌

వైసిపి రాజకీయ కుట్రలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 30: రాష్ట్రంలో అశాంతి రేపేందుకు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ ఒక్కో వర్గాన్ని రెచ్చగొడుతోందని ఎమ్మెల్సీ, టిడిపి అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆరోపించారు. ఆదివారం ఇక్కడ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు ప్రభుత్వం అండగా నిలిచి పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచిందని గుర్తుచేశారు. ఫిట్‌మెంట్ బెనిఫిట్‌ను 43 శాతం ప్రకటించిందని, అంగన్‌వాడీలకు వేతనాల పెంపుతో పాటు 15వేల మందికి పైగా కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేసేందుకు ప్రయత్నిస్తుంటే ప్రతిపక్ష వైసిపి ఉద్యోగుల్లో అపోహలు సృష్టించి అసత్యాలు ప్రచారం చేయటం నీచ రాజకీయ సంస్కృతికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందన్నారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు మాస్టర్ హెల్త్‌కార్డులు రూ. 100కోట్లతో మంజూరు చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఈనేపథ్యంలో ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తారని, పదవీ విరమణ వయసును కుదిస్తున్నారనే ప్రచారంతో వైసిపి కుతంత్రాలు పన్నుతోందని ఆరోపించారు. ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసే ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేయలేదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా వైసిపి నేతలు జగన్, రోజా వాస్తవాలు గ్రహించకపోతే భవిష్యత్తులో ప్రజలే తగిన బుద్ధిచెప్తారని హెచ్చరించారు. ఉద్యోగులు విజ్ఞతతో వ్యవహరించి ఆరోపణలను తిప్పికొట్టాలని ఎమ్మెల్సీ డొక్కా కోరారు.