ఆంధ్రప్రదేశ్‌

అద్వానీని కాదని మోదీకి మద్దతిచ్చా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 30: నాకెంతో ప్రియమైన బిజెపి సీనియర్ నేత అద్వానీని కాదని గుజరాత్ ముఖ్యమంత్రిగా సంస్కరణలకు శ్రీకారం చుట్టిన నరేంద్ర మోదీకి ప్రధాని అభ్యర్థిగా మద్దతిచ్చానని బిజెపి తరపున ఉప రాష్టప్రతి అభ్యర్థి ఎం.వెంకయ్యనాయుడు తన మనసులో మాటను బయటపెట్టారు. ఉప రాష్టప్రతిగా నామినేషన్ వేసిన తర్వాత తొలిసారి విశాఖలో సన్నిహితులతో ఆదివారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఘట్టాలను పంచుకున్నారు. వాజ్‌పేయి తరువాత అంతటి ప్రజాకర్షణ కలిగిన నాయకుడు అద్వానీ ఒక్కరేనని, 2009 ఎన్నికల సందర్భంగా కొన్ని కారణాల నేపథ్యంలో ప్రజలు అద్వానీ నాయకత్వాన్ని అంగీకరించలేదన్నారు. అప్పటికే గుజరాత్‌ను ప్రగతిపథంలో నడిపిస్తున్న మోదీని ప్రజలు దైవదూతగా భావించారన్నారు. మోదీ నాయకత్వాన్ని ప్రజలు ఆమోదించడంవల్లే ఘనవిజయం సాధ్యమైందని, పదేళ్లపాటు మోదీ ప్రధానిగా ఉండాలన్నదే తన ఆకాంక్షగా పేర్కొన్నారు. ప్రపంచం యావత్తు భారత ప్రధాని మోదీ వైపు చూస్తోందని, అత్యంత ప్రజాదరణ కలిగిన నేతల్లో మోదీ నాలుగో స్థానంలో ఉన్నారన్నారు. ఆర్థిక అసమానతలు తొలగి, ప్రజలంతా దేశ సంపదను అనుభవించాలన్నదే మోదీ లక్ష్యమని వివరించారు. దేశాన్ని అభివృద్ధికి దూరంగా ఉంచుతున్న అవినీతిని అంతమొందించేందుకు ప్రధాని మోదీ తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని, భవిష్యత్‌లో భారత్ ప్రపంచ అగ్రగామి దేశాల సరసన నిలుస్తుందన్నారు. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లో మోదీ మరోసారి ప్రధానిగా ఎన్నికయ్యాక, క్రియాశీలక రాజకీయాల నుంచి వైదొలగి సమాజ సేవకు వెళ్లాన్నదే తన అభిప్రాయమన్నారు. అయితే, భారత ఉప రాష్టప్రతి పదవికి తన పేరు ప్రతిపాదించడంతోపాటు పార్లమెంటరీ బోర్డు ఏకగ్రీవంగా నిర్ణయించడంతో కాస్త అసంతృప్తితోనే పార్టీ ఆదేశాలను శిరసావహించక తప్పలేదన్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ పశ్చిమ ప్రాంతం నుంచి, స్పీకర్ సుమిత్రా మహాజన్ మధ్య భారతం నుంచి, నూతన రాష్టప్రతి ఉత్తరాది నుంచి ఎన్నికైన నేపథ్యంలో దక్షిణాదినుంచి తన అభ్యర్థిత్వం ఖరారు చేయాల్సి వచ్చిందన్నారు. వ్యవస్థకు, దేశానికి పనిచేయాలంటే తానే సమర్థుడనని, ప్రధాని మోదీ భావించారని, ఇదే విషయాన్ని పార్లమెంటరీ పార్టీ సమావేశంలో అమిత్ షా తదితరులు వెల్లడించారన్నారు. అధిష్ఠానం తీసుకున్న ఈ నిర్ణయంతో దశాబ్దాలుగా పార్టీకి సేవచేస్తున్న తాను, కన్నతల్లికి దూరమవుతున్న భావన కన్నీటిపర్యంతం చేసిందన్నారు. కార్యకర్త స్థాయినుంచి పార్టీయే ఆశ, శ్వాసగా పనిచేశానన్నారు. గతంలో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న కాలంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉంటూ పదవికి రాజీనామా చేసి, పార్టీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు చేపట్టానని, ఇప్పుడు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా రాజీనామా చేసి, ఉపరాష్టప్రతిగా వెళుతున్నానన్నారు. రాజ్యాంగ బద్ధంగా, రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తానని, అందుకు తాను తెనే్నటి విశ్వనాథం, గౌతు లచ్చన్న వంటి మహోన్నతుల స్ఫూర్తి ఉపకరిస్తుందన్నారు.

చిత్రం.. విశాఖలో జరిగిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతున్న వెంకయ్య నాయుడు