ఆంధ్రప్రదేశ్‌

ఒంగోలు-గొట్లగట్టు మధ్య నాలుగు లేన్ల రహదారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జూలై 30: ఒంగోలు-గొట్లగట్టు మధ్య నాలుగులేన్ల రహదారి మంజూరైందని ఒంగోలు ఎంపి వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు. సుబ్బారెడ్డిని నేషనల్ హైవేస్ ప్రాజెక్టు డైరక్టర్ ఎ వెంకటేశ్వరరావు, వాక్స్ కన్సల్‌టెన్సీ టీమ్ హెడ్ త్యాగరాజన్, నేషనల్ హైవేస్ ఎఇ శ్రీనివాసులు ఆదివారం ఆయనను కలిశారు. వైవి మాట్లాడుతూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కారికి పలుమార్లు విజ్ఞప్తి చేసిన మేరకు సాగర్‌మాల ప్రాజెక్టు కింద ఒంగోలు నుండి గొట్లగట్టువరకు నాలుగు వరసల రహదారిని మంజూరు చేశారన్నారు. ఒంగోలు నుండి గొట్లగట్టువరకు (73కిలోమీటర్లు) నాలుగు బైపాస్‌రోడ్లు అవసరమని అందుకు అనుగుణంగా బైపాస్ రోడ్లను ఏర్పాటుచేయాలని కేంద్రమంత్రిని కోరామన్నారు.