ఆంధ్రప్రదేశ్‌

మత్తు మహమ్మారిపై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (క్రైం), జూలై 30: గంజాయి, డ్రగ్స్, గుట్కా, మత్తు పదార్థాల నివారణకు ఎక్సైజ్, పోలీసులతో కలిసి ప్రత్యేక టాస్క్ఫోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టర్ కె.వెంకటేశ్వరరావు తెలిపారు. విశాఖలోని మురళీనగర్‌లో గల ఎక్సైజ్ డిసి కార్యాలయంలో ఆదివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. గత నెల 18న జరిగిన క్యాబినేట్ సమావేశంలో ఈ స్పెషల్ టాస్క్ఫోర్స్ ఏర్పాటు గురించి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. వచ్చే నెల మూడోతేదీన జరగనున్న క్యాబినేట్ సమావేశంలో ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టి, ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టడానికి ఏ విధంగానైతే టాస్క్ఫోర్స్ పనిచేస్తుందో, అదే విధంగా నూతన ప్రత్యేక టాస్క్ఫోర్స్ గంజాయి, డ్రగ్స్, తదితర స్మగ్లింగ్ భరతం పడుతుందన్నారు. బెల్ట్ దుకాణాలను నడిపే మద్యం దుకాణాలపై చర్యలు తప్పవని వెంకటేశ్వరరావు హెచ్చరించారు. ఆదివారం ఉదయం ప్రకాశం జిల్లాలో నాలుగు బెల్ట్ దుకాణాలపై దాడి చేశామని, దీనికి కారణమైన మద్యం దుకాణాల లైసెన్స్ సస్పెన్స్ చేసినట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 19నుండి 29వరకు రాష్ట్రంలోని బెల్ట్ దుకాణాలపై దాడులు చేశామని, 1403కేసులు నమోదు చేసి, 1465మందిని అరెస్టు చేశామన్నారు. బెల్ట్ దుకాణాలకు మద్యాన్ని రవాణా చేస్తున్న 67మద్యం దుకాణాలపై కేసులు నమోదు చేసి, 25మద్యం దుకాణాలను లైసైన్స్ రద్దు చేశామన్నారు. ఎక్కడైన గంజాయి, డ్రగ్స్, గుట్కా, ఇతర మత్తు పదార్థాల స్మగ్లింగ్, బెల్ట్ దుకాణాలు గురించి తెలిస్తే టోల్‌ఫ్రీ నెం. 18004254868కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో విశాఖ ఎక్సైజ్ డిసి గోపాలకృష్ణ, ఎసి బాబ్జీ పాల్గొన్నారు.