ఆంధ్రప్రదేశ్‌

వెంకన్న పంచన ఏడాది బిడ్డ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 30: ఏడాది వయసు కలిగిన ఓ చిన్నారిని తిరుమలలోని డిఎన్‌బి షెడ్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. ఆ చిన్నారి ఏడుపులు విని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో టూటౌన్ ఇన్స్‌పెక్టర్ కె.వెంకటరవి తన సిబ్బందితో అక్కడికి చేరుకుని బాబు చెంత తిరుమల బాలాజి అనే పసుపురంగు బ్యాగు ఉండటాన్ని గుర్తించారు. అందులో ఒక పాలడబ్బా, పాలబుడ్డీ, మెరీనా బిస్కెట్, ఒక స్టీల్ ప్లాస్క్, సెవన్ అప్ కూల్‌డ్రింక్, బట్టలు ఉండటాన్ని గుర్తించారు. ఈ పరిస్థితిని బట్టి చూస్తే బిడ్డను సాకలేక తల్లిదండ్రులే వదిలి వెళ్లి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కాగా చిన్నారిని తిరుపతిలోని శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. కాగా బాబును ఎవరు వదిలివెళ్లారన్న అంశంపై పోలీసులు సిసి పుటేజ్‌లను పరిశీలిస్తున్నారు.