ఆంధ్రప్రదేశ్‌

అయోమయంలో పడేస్తున్న మీడియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుని, జూలై 30: రాష్ట్రంలో అన్ని వర్గాలవారిని అయోమయానికి గురిచేసే విధంగా వైసిపి అనుకూల మీడియా ప్రయత్నిస్తోందని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా ఆదివారం తునిలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల వయోఃపరిమితిపై తప్పుడు ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు. జీవో అన్నది సంబంధిత మంత్రి నుండి రూపొందిన తరువాత ముఖ్యమంత్రి కార్యాలయానికి పరిశీలనకు వెళ్ళిన తరువాత కేబినెట్ అమోదంతో బయటకు వస్తుందన్నారు. ఈ సంగతి కూడా తెలియకుండా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఆధారాలు బయటపెట్టి రాతలు రాస్తే బాగుంటుందని, అంతేకాని ఉద్యోగులకు, ప్రభుత్వానికి తగవుపెట్టి రాష్ట్రంలో అశాంతి వాతావరణానికి వైసిపి ప్రయత్నించడం మంచిది కాదని ఆయన హితవు పలికారు. ఉద్యోగల వయోఃపరిమితిలో కోతలు లేవని ప్రభుత్వం చెబుతున్నా నిరాధారణ ఆరోపణలు చేయడం చూస్తే రాష్ట్రంలో దిగజారిన ప్రతిపక్షం ఉందని చెప్పడానికి సిగ్గుపడుతున్నామని యనమల వ్యాఖ్యానించారు.