ఆంధ్రప్రదేశ్‌

ఏపి సెట్‌కు 75.17 శాతం హాజరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 30: రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన ఏపి సెట్ పరీక్షకు 75.17 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్టు ఏపి సెట్ మెంబర్ సెక్రటరీ కె.శ్రీనివాసరావు తెలిపారు. 67 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని చెప్పారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నా పత్రాన్ని ఎయు విసి నాగేశ్వరరావు ఆదివారం ఉదయం విడుదల చేశారు. 31 సబ్జెక్ట్‌ల్లో ఈ పరీక్ష నిర్వహించినట్టు శ్రీనివాసరావు పేర్కొన్నారు. వచ్చే నెల 10వ తేదీన ఈ సెట్ కీని విడుదల చేస్తామని చెప్పారు. ఆరోజు అభ్యర్థుల నుంచి వచ్చే సూచనలు, అభ్యంతరాలను స్వీకరిస్తామని ఆయన తెలిపారు. ఆగస్టు 15 వరకూ అభ్యంతరాలు స్వీకరిస్తామని ఆయన చెప్పారు. తుది కీని ఆగస్టు 20న విడుదల చేస్తామన్నారు. యుజిసి సభ్యుల పరిశీలన అనంతరం వారి సూచనలకు అనుగుణంగా ఫలితాలను విడుదల చేస్తామని ఆయన చెప్పారు. విశాఖ ప్రాంతీయ కేంద్రంలో 9343 మంది, రాజమండ్రిలో 6622 మంది, గుంటూరులో 8837 మంది, నెల్లూరులో 2480 మంది, అనంతపురంలో 7935 మంది, తిరుపతి ప్రాంతీయ కేంద్రంలో 7806 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని శ్రీనివాసరావు చెప్పారు. అత్యధికంగా తెలుగు సబ్జెక్ట్‌కు 4906 దరఖాస్తులు, లైఫ్ సైనె్సస్‌కు 4787, అత్యల్పంగా లింగ్విస్టిక్స్‌కు 17 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. విశాఖలో జరిగిన ఏపి సెట్ పరీక్షలను ఎయు విసి నాగేశ్వరరావు పరిశీలించారు.

చిత్రం.. విశాఖలో ఆదివారం ఏపి సెట్ పరీక్ష రాస్తున్న అభ్యర్థులు