ఆంధ్రప్రదేశ్‌

ఐదో రోజుకు చేరిన గృహ నిర్బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూలై 30: మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం గృహ నిర్బంధం ఆదివారం ఐదవ రోజుకు చేరింది. ఆగస్టు 2వ తేదీ వరకు ముద్రగడకు గృహ నిర్బంధాన్ని విధిస్తూ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. ముద్రగడ ఇంటి బయట నిషేధాజ్ఞలు అమలులో ఉండగా, మరోవైపు ఆదివారం ఉదయం వివిధ ప్రాంతాలకు చెందిన కాపు నేతలు ఆయన నివాసానికి చేరుకున్నారు. సందర్శకులను తనిఖీచేసి, గుర్తింపు పత్రాలను పరిశీలించిన పిమ్మట పోలీసులు అనుమతించారు. మధ్యాహ్నం ముద్రగడ పద్మనాభం ఆయన సతీమణి పద్మావతి సహా పలువురు కాపునేతలు ఇంటి ఆవరణలో ఖాళీ కంచాలు, గరిటెలతో నిరసన తెలియజేశారు. రాష్టమ్రంతా కాపులు భోజన సమయంలో ఇకనుండి ఖాళీ కంచాలతో నిరసన తెలియజేయాలని ముద్రగడ పిలుపునిచ్చారు. కాపుల ఆకలి కేకలు చంద్రబాబుకు వినిపించేలా చేయాలని సూచించారు. ప్రతిరోజు సాయంత్రం కొవ్వొత్తులు వెలిగించాలని కోరారు. యువత ఇంకా నిరసన కార్యక్రమాలు ఏ విధంగా నిర్వహించాలన్న విషయమై ఆలోచించాలని కోరారు. కాపు జెఎసి నేతలు ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు, పిసిసి ప్రధాన కార్యదర్శి పంతం నానాజీ తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు. కాగా కిర్లంపూడిలో సాయుధ బలగాల పహారా కొనసాగుతోంది. చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు.

చిత్రం.. గరిటెలతో కంచాలపై కొడుతూ నిరసన తెలుపుతున్న ముద్రగడ దంపతులు, కాపు నేతలు