ఆంధ్రప్రదేశ్‌

చినమిల్లి దీక్ష భగ్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూలై 30: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గృహనిర్బంధాన్ని నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా కాపునాడు అధ్యక్షుడు చినమిల్లి వెంకట్రాయుడు చేస్తున్న అమరణ నిరాహార దీక్షను ఆదివారం ఉదయం పోలీసులు భగ్నం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని రాయలం గ్రామంలోని తన స్వగృహంలో చినమిల్లి ఆమరణ నిరాహార దీక్షకు దిగిన సంగతి విదితమే. 144 సెక్షన్, 30 పోలీస్ యాక్టు అమల్లో ఉండటంతో ఆయన తన స్వగృహంలోనే గత మూడు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్నారు. కాగా నరసాపురం డిఎస్పీ జి పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో భీమవరం సిసిఎస్ సిఐ జయసూర్య, టూటౌన్ సిఐ ఎ.చంద్రశేఖర్, సిఐ అప్పలస్వామి, భీమవరం రూరల్ సిఐ నాగరాజు ఆదివారం ఉదయం చినమిల్లి అమరణ దీక్షను భగ్నం చేశారు. దీక్షా శిబిరం నుంచి చినమిల్లిని భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలకు ఆయన నిరాకరించారు. దీనితో పోలీసులు, వైద్యులు, కాపునేతల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. బలవంతంగా వైద్య పరీక్షలుచేసి, ఫ్లూయిడ్స్ ఎక్కిస్తే ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు. దీనితో పోలీసులు అక్కడ నుంచి వెనుదిరిగారు. నరసాపురం డిఎస్పీ జి.పూర్ణచంద్రరావు, ఆసుపత్రి వైద్యులు మరోసారి ప్రయత్నించినా ఫలితంలేకపోయింది. అనంతరం చినమిల్లి ఆసుపత్రిలో ఆమరణదీక్షను కొనసాగించారు. కాగా సాయంత్రం బలవంతంగా ఆయనకి ఫ్లూయిడ్స్ ఎక్కించి, వైద్య పరీక్షలు నిర్వహించి, రాయలంలోని ఆయన స్వగృహానికి బందోబస్తు మధ్య తరలించారు.

చిత్రం.. చినమిల్లిని ఆసుపత్రికి తరలిస్తున్న పోలీసులు