ఆంధ్రప్రదేశ్‌

నంద్యాల గెలుపుతో 2019 ఎన్నికల విజయాలకు నాంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, జూలై 30: నంద్యాలలో త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో విజయం సాధించి 2019లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపునకు నాంది పలకాలని రాష్ట్ర సహకార, మత్స్య శాఖామంత్రి ఆదినారాయణరెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సింహాచలంలో ఆదివారం జరిగిన అడివివరం సహకార పరపతి సంఘం నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారోత్సవానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంద్యాలలో జగన్‌ను ఓడించాలన్నారు. 2019 ఎన్నికల్లో పులివెందుల్లో గెలుపు లక్ష్యంగా వ్యూహరచన చేస్తామని మంత్రి వెల్లడించారు. 2014లో విశాఖలో విజయమ్మ, కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానందరెడ్డి ఓటమిలను ఆయన ప్రస్తావిస్తూ రాజశేఖర రెడ్డి కుటుంబంపై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయ వ్యూహ రచనను ఆయన ప్రశంసించారు. కో ఆపరేటీవ్ ఎన్నికల్లో వైసిపి అభ్యర్థుల ఓటమితో జగన్ మోహన్‌రెడ్డికి గన్‌తో కొట్టినట్టైందని ఆయన తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. జగన్ పడిపోయిన గన్ అని మీరే అసలైన గన్‌లని ఆయన గెలిచిన డైరెక్టర్‌లనుద్దేశించి అన్నారు. విశాఖలో ఓటర్లు విచక్షణతో ఓటు వేస్తారనడానికి అనేక గెలుపులు రుజువు చేశాయని ఆయన అన్నారు. మా వైపు ఆ పరిస్థితి ఉండదంటూ ఈ సందర్భంగా మంత్రి అనడం గమనార్హం. రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీ విజయాలకు ఇదే స్ఫూర్తి కావాలని ఆయన పిలుపునిచ్చారు. మంత్రి గంటా నేతృత్వంలో మీరంతా త్వరలో జరగనున్న నంద్యాల ఉప ఎన్నికకు రావాలని ఆయన ఇక్కడి పార్టీ శ్రేణులను ఆహ్వానించారు.
రూ. 20 కోట్లతో విశాఖలో అభివృద్ధి పనులు
తన పరిధిలో ఉన్న శాఖల నుండి సుమారు 20 కోట్ల రూపాయలను మంజూరు చేసి విశాఖపట్నంలో పలు అభివృద్ధి పనులకు సహకారం అందిస్తానని రాష్ట్ర మంత్రి ఆదినారాయణరెడ్డి హామీ ఇచ్చారు. సభలో విద్యా, మానవ వనరుల అభివృద్ధిశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు మంత్రి ఆదినారాయణరెడ్డిని కోరగా ఆయన అంగీకరిస్తూ పై విధంగా ప్రకటించారు. మత్స్యకారులకు వలలు, బోట్లు, డీజిల్‌పై సబ్సిడీ, ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను 90 శాతం సబ్సిడిపై ఇస్తామని ఆయన ప్రకటించారు. కోల్డ్ స్టోరేజ్‌లు, చేపలు ఆరబెట్టుకునేందుకు ఫ్లాట్‌ఫారాలు నిర్మాణం చేస్తామని ఆయన అన్నారు. ఇరవై సెంట్లు స్థలం ఉంటే రైతుబజార్లు ఏర్పాటుకు సహకరిస్తామని మంత్రి ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో 30 లక్షలు, పట్టణాల్లో 90 లక్షలు స్థాయిని బట్టి రైతుబజార్లు ఏర్పాటు చేసుకోవచ్చునని ఆయన పేర్కొన్నారు. సభలో కో ఆపరేటీవ్ సొసైటీ అధ్యక్షుడు కర్రి అప్పలస్వామి నాయకత్వాన్ని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఎమ్మెల్యేలు బండారు సత్యన్నారాయణమూర్తి, పంచకర్ల రమేష్‌బాబు మాట్లాడారు.

చిత్రం.. సభలో మాట్లాడుతున్న మంత్రి ఆదినారాయణరెడ్డి