ఆంధ్రప్రదేశ్‌

తుందుర్రు ఆక్వా పార్కు మా పరిధిలోకి రాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 31: పశ్చిమ గోదావరి జిల్లాలోని తుందుర్రులో మెగా ఆక్వాఫుడ్ పార్క్ ఎర్పాటుకు సంబంధించిన పర్యావరణ అనుమతులు కేంద్ర పరిధిలో లేవని కేంద్ర అడవులు, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్థన్ తెలిపారు. తుందుర్రులో నిర్మాణంలో ఉన్న ఫుడ్ ఫ్యాక్టరీ 100 ఎకరాల విస్తీర్ణానికి లోబడి ఏ, బీ క్యాటగిరీలో ఉందని, అందువలన దీనికి సంబంధించిన పర్యావరణ అనుమతులు మంజూరు చేసే అధికారం రాష్ట్రంలోని పర్యావరణ నియంత్రణ బోర్డుకు మాత్రమే పరిమితం అవుతుందని వెల్లడించారు. మొగల్తూరులోని ఆనంద సీఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో విషవాయువుల కారణంగా అయిదుగురు కార్మికులు మరణించిన విషయం తమ దృష్టికి రాలేదని చెప్పారు. తుందుర్రులో మెగా ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణంపై సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ ఎంపీ ఎంఏ ఖాన్, వైకాపా ఎంపీ విజయ సాయిరెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి హర్షవర్దన్ సమాధానం ఇచ్చారు. అలాగే ఉపాధి హామీ పథకంలో కనీస వేతన రేటును సవరించడానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిరాకరించినట్లు గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి రామ్ కృపాల్ యాదవ్ వెల్లడించారు. విజయ సాయిరెడ్డి రాజ్యసభలో ఉపాధి హామీ పథకంపై అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. దేశవ్యాప్తంగా 52 శాతం ఉన్న బీసీలకు రాజ్యాంగబద్ధ కమిషన్ ఏర్పాటు చేయడం చరిత్రాత్మక నిర్ణయమని విజయసాయి రెడ్డి అన్నారు. బిసి కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చలో పాల్గొని, మద్దతు తెలిపిన విజయ సాయిరెడ్డి, ఓబిసి జాబితాలో కులాలను చేర్చే అధికారం రాష్ట్రాలకే ఉండాలని స్పష్టం చేశారు. అలాగే పదోన్నతుల్లో బిసిలకు రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని, న్యాయ వ్యవస్థలోనూ రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని పరిశీలించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.