ఆంధ్రప్రదేశ్‌

కాషారుూకరణ ముసుగులో మాఫియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 31: కాషారుూకరణ ముసుగులో ఆర్థిక, భూ, డ్రగ్స్ మాఫియా తయారైందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ ఆందోళన వ్యక్తంచేశారు. ఈ మాఫియాకు గుజరాత్ కేంద్రంగా మారిందని ఆరోపించారు. విద్య, వైద్యం, ఉపాధి హక్కుల సాధనకై ఎఐఎస్‌ఎఫ్, ఎఐవైఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో కన్యాకుమారి నుండి చేపట్టిన లాంగ్‌మార్చ్ బస్సుయాత్ర సోమవారం గుంటూరు నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక మహిమాగార్డెన్స్‌లో జరిగిన బహిరంగసభలో నారాయణ మాట్లాడుతూ దేశాన్ని కాషారుూకరణ చేస్తున్న బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి యువత ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో కాషాయదళాల దాడులు పెరిగిపోయాయని, వాటిని నివారించకుండా కమ్యూనిస్టులను వ్యతిరేకించడం సమంజసం కాదన్నారు. గో సంరక్షణ దళాలు చట్టాలను చేతుల్లోకి తీసుకుని కాషాయ ముసుగులో దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎఐఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు వలివుల్లా ఖాద్రి మాట్లాడుతూ విద్యార్థులు, యువకుల హక్కుల సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. లాంగ్‌మార్చ్ అనంతరం మరో పోరాటానికి నాంది పలుకుతామని స్పష్టంచేశారు. కార్యదర్శి విశ్వజిత్‌కుమార్ మాట్లాడుతూ గో మాంసంపై చర్చిస్తున్న ప్రభుత్వాలు దేశంలో పెరిగిపోతున్న రైతుల ఆత్మహత్యలు, పేదలకు ఆహారం, తాగునీరు, నిరుద్యోగ సమస్యపై చర్చించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. బిఎలు, ఎంబిఎలు చదివిన యువతకు ఉద్యోగ కల్పనలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయన్నారు.

చిత్రం.. సభలో మాట్లాడుతున్న సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ