ఆంధ్రప్రదేశ్‌

స్వచ్ఛ తిరుమలకు ఓఎన్‌జిసి రూ.6.78కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 31: స్వచ్చ్భారత్‌లో భాగంగా తిరుమలలో చేపడుతున్న కార్యక్రమాలకు సహకారం అందించేందుకు ఓఎన్‌జిసి తమ సామాజిక బాధ్యతగా సోమవారం రూ.6.78 కోట్ల చెక్కును టిటిడి ఇఓ అనిల్‌కుమార్ సింఘాల్‌కు అందించింది. టిటిడి పరిపాలనా భవనంలో ఓఎన్‌జిసి, టిటిడి అధికారులను ఉద్దేశించి ఇఓ మాట్లాడుతూ స్వచ్ఛ ఆదర్శనీయ ప్రాంతంగా తిరుమల ఎంపికైన నేపథ్యంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ఓఎన్‌జిసి సహకారం అందిస్తోందని అన్నారు. ఈ నేపథ్యంలో రూ.13 కోట్లు ఇచ్చేందుకు ముందుకొచ్చిన ఆ సంస్థ తొలివిడతగా రూ.6.78 కోట్లు అందించిందన్నారు. తిరుమలలో మురుగునీరు శుద్ధి చేసి వినియోగానికి, ఘన వ్యర్థాల నిర్వహణకు, విద్యుత్ ఆధునీకరణ, పొదుపు చర్యలు, మెరుగైన పారిశుద్ధ్యం, రవాణా తదితర అభివృద్ధి పనులకోసం ఈ నిధులను ఖర్చు చేస్తామన్నారు. మరింత వేగంగా అభివృద్ధి పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. ఓఎన్‌జిసి ప్రతినిధులను అభినందించి, శ్రీవారి తీర్థప్రసాదాలను అందించారు. ఓఎన్‌జిసి డైరెక్టర్ డిడి మిశ్రా మాట్లాడుతూ తిరుమలలో పలు అభివృద్ధి పనులకు సంబంధించి నిధులు అందించేందుకు టిటిడితో ఎంఓయు కుదుర్చుకోవడం తమకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సమావేశంలో ఓఎన్‌జిసి అధికారులు, టిటిడి అధికారులు పాల్గొన్నారు.

చిత్రం.. స్వచ్ఛ తిరుమలకు టిటిడికి ఓఎన్‌జిసి తొలివిడతగా రూ.6.78 కోట్ల విరాళం చెక్కును
ఇఓ అనిల్‌కుమార్ సింఘాల్‌కు అందిస్తున్న ఓఎన్‌జిసి డైరెక్టర్ మిశ్ర, ఇడి ఎస్‌ఎస్‌సి పార్థిబన్, జిఎం సాజిద్ జమీల్ తదితరులు