ఆంధ్రప్రదేశ్‌

నేటినుంచి పెరిగిన రిజిస్ట్రేషన్ చార్జీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 31: రాష్టవ్య్రాప్తంగా మొత్తం 299 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మంగళవారం నుంచి పెరిగిన బుక్ వాల్యూతో పాటు, పెంచిన రిజిస్ట్రేషన్ చార్జీలు కూడా అమల్లోకి రాబోతున్నాయి. మొత్తంపై ప్రస్తుతం ఉన్న విలువలపై 10 శాతం పెరగ్గా, మార్కెట్ విలువ కంటే బాగా తక్కువ ఉన్న కొన్ని ప్రాంతాల్లో 25 శాతం వరకు పెరిగింది. అమరావతి ప్రాంతాల్లో పెరిగిన విలువలు వల్ల ఎలాంటి సమస్య లేకపోయినా విజయవాడ సమీపంలోని పోరంకి ప్రాంతంలో మార్కెట్ ధర గజం 11వేలు ఉంటే పెరిగిన బుక్‌వాల్యూ 12వేల 100 రూపాయలకు చేరింది. విజయవాడ పాతబస్తీలో గజం లక్ష రూపాయలు ఉంటే బుక్ వాల్యూ 70వేలు వరకు ఉంది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వానికి రూ.3300 కోట్లు వరకు ఆదాయం వస్తుండగా పెరిగిన బుక్ వాల్యూతో 600 నుంచి వెయ్యి కోట్ల వరకు అదనపు రాబడి రాగలదని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా గడచిన వారం రోజులుగా రాష్టవ్య్రాప్తంగా క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు ముమ్మరంగా సాగాయి. మున్సిపల్ కార్పొరేషన్లు, నగర పంచాయతీలు, అర్బన్ డెవలప్‌మెంట్ అథార్టీలు, నోటిఫైడ్ ఏరియాలను ఏ కేటగిరిలోకి, మేజర్ పంచాయతీలు, మున్సిపాల్టీలను బి కేటగిరిలోకి, మైనర్ పంచాయతీలు సి కేటగిరిలోకి తెస్తూ రిజిస్ట్రేషన్ల చార్జీలను పెంపుదల చేశారు. ఆర్‌సిసి బిల్డింగ్స్ కాంపోనెంట్‌లో జీ ప్లస్ 2 భవనాలకు ఏ కేటగిరిలో చ.అడుగు రూ.980లు, బి కేటగిరిలో రూ.870లు, సి కేటగిరిలో రూ.620కు పెంపుదల చేశారు. అలాగే థర్డ్ఫో్లర్‌కు పై కేటగిరీల వారీగా రూ.1060, రూ.980, రూ.690లకు పెంచారు. సెల్లార్ పార్కింగ్‌లకు రూ.710, రూ.630, రూ.460కు పెంచారు. మూడువైపులా కామన్‌వాల్ అపార్ట్‌మెంట్‌లకు రూ.1060, రూ.980, రూ.620లు చొప్పున పెంచారు. పది అడుగుల ఎత్తు దాటిన వాటికి రూ.1030, రూ.960, రూ.690లు, సినిమా హాళ్లు, మిల్లులు, ఫ్యాక్టరీల గోడలతో కలుపుకుని పది అడుగులు ఎత్తు దాటితే చ.అడుగుకు రూ.740లు, రూ.680, రూ.530లు పెంచారు. ఫౌల్ట్రీ ఫారాలకు సంబంధించి ఏసిసి షీట్, జింక్ షీట్, మంగుళూరు టైల్స్, మద్రాస్ టెర్రస్ రూఫ్, ఆర్‌సిసి రూఫ్ నిర్మాణాలకు రూ.530, రూ.430, రూ.310లకు, మట్టితో కట్టినవాటికి రూ.320, రూ.240, రూ.180లకు పెంచారు. తాటాకు, పామాయిల్, కొబ్బరి ఆకులతో ఏర్పాటుచేసిన ఇళ్లకు ఎలాంటి చార్జీలు లేవు. అయితే గోడలు కట్టి ఉంటే రూ.150లు, రూ.100, రూ.80లు చొప్పున పెంచారు. గత ఏడాది బుక్ వాల్యూ పలు ప్రాంతాల్లో 200 శాతం వరకు పెరిగింది. అయితే అప్పుడు మార్కెట్ విలువ అధికంగా ఉంది.