ఆంధ్రప్రదేశ్‌

తుది దశకు పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూలై 31: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం గృహ నిర్బంధం సోమవారం ఆరవ రోజుకు చేరింది. ముద్రగడకు విధించిన గృహనిర్బంధం గడువు ఆగస్టు 2వ తేదీతో ముగియనుంది. అయితే నిర్బంధాన్ని పొడిగించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలను కిర్లంపూడిలో మరికొన్ని రోజుల పాటు కొనసాగించేందుకు నిర్ణయించినట్టు సమాచారం! పోలీసు బందోబస్తు ఎంతకాలం ఉంచాలన్న విషయమై ప్రభుత్వ వర్గాలకే ప్రశ్నార్ధకంగా మారింది. వాస్తవానికి గృహ నిర్బంధం నుండి తప్పించిన మరుక్షణమే నిరవధిక పాదయాత్ర ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ముద్రగడ ప్రకటించారు.
అది ఏ రోజైనా సరే పాదయాత్ర విషయంలో మాత్రం పునరాలోచించే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో బందోబస్తు ఉపసంహరణ అసాధ్యమని అధికారిక వర్గాలు భావిస్తున్నాయి. క్రమంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బందోబస్తును సడలిస్తున్నప్పటికీ కిర్లంపూడి పరిసర గ్రామాల్లో మాత్రం సాయుధ బలగాల పహారా కొనసాగుతోంది. వివిధ గ్రామాల నుండి కిర్లంపూడి వెళ్ళే మార్గంలో చెక్‌పోస్ట్‌లు కొనసాగుతున్నాయి. మరోవైపు కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి సోమవారం వివిధ ప్రాంతాలకు చెందిన కాపు జెఎసి ప్రతినిధులు పరామర్శించేందుకు వెళ్ళారు. పరిసర గ్రామాలకు చెందిన మహిళలు, యువత కాపు ఉద్యమనేతకు మద్దతు పలికేందుకు ఇంటికి వెళ్ళారు. ప్రతిఒక్కరి వివరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించిన పిమ్మట ముద్రగడ నివాసంలోకి అనుమతించారు. పద్మనాభం ఇంటి ఆవరణలో మధ్యాహ్నం కాపు జెఎసి ఆధ్వర్యంలో ఖాళీ కంచాలు, గరిటెలతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ సమస్యను పరిష్కరించాల్సింది పోయి ఎదురుదాడికి దిగుతున్నారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. జబ్బు ఎక్కడైతే మందు కూడా అక్కడే వేయాలని, అలా కాకుండా జబ్బు మరింత ముదిరిపోయే రీతిలో వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. కాపుల పోరాటం పండు దశకు చేరిందని, ఇంకా బాగా కుళ్ళి కుశించిపోయే వరకు పరీక్షించడం చంద్రబాబుకు మంచి పద్ధతి కాదని, అలా చేస్తే ఆయనకే నష్టమని పేర్కొన్నారు. రిజర్వేషన్లు సాధించేవరకు కాపు జాతి యావత్తూ పోరాట పటిమతో సాగాలని పిలుపునిచ్చారు. కాపు జెఎసి నాయకులతో పాటు పిసిసి ప్రధాన కార్యదర్శి పంతం నానాజీ తదితరులు ముద్రగడను కలసి సంఘీభావం తెలియజేశారు.

చిత్రం.. కాపు జెఎసి ఆధ్వర్యంలో ఖాళీ కంచాలు, గరిటెలతో నిరసన తెలియజేస్తున్న మాజీ మంత్రి ముద్రగడ