ఆంధ్రప్రదేశ్‌

ఎన్టీఆర్ జలరాశి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 11: రాష్ట్రంలో చిన్న,సన్నకారు రైతు లు, ఎస్టీ, ఎస్టీ రైతుల వ్యవసాయానికి కొత్తగా 1.25 లక్షల బోరు బావులు, వాటికి పంపుసెట్లను అమర్చేందుకు రూ.1400 కోట్లతో కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేసినట్లు ఏపి ట్రాన్స్‌కో సిఎండి కె విజయానంద్ తెలిపారు. ఈ పథకానికి ‘ఎన్టీఆర్ జలరాశి’ అని నామకరణం చేశారు. గ్రామీణాభివృద్ధి శాఖ తవ్విన బోరు బావులకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి విద్యుత్‌ను ఆదా చేసే పంపుసెట్లను అమర్చుతారు. ఇంతవరకు ఎన్టీఆర్ జలసిరి మొద టి దశలో 5918 బోర్‌వెల్స్‌కు పంపుసెట్లను అమర్చారు. ఈ నెలలో 1200 బోర్‌వెల్స్ తవ్వి పంపుసెట్లను అమర్చుతారని కె విజయానంద్ చెప్పారు. రాష్ట్రంలో ప్రాథమిక రంగమైన వ్యవసాయంలో రెండు అంకెల వృద్ధిరేటును సాధించేందుకు ఎన్టీఆర్ జలరాశి స్కీంను అమలు చేస్తామన్నారు. 13 జిల్లాల్లో 1.25 లక్షల బోర్‌వెల్స్‌కు పంపుసెట్లను సత్వరమే అమర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రధానంగా రాయలసీమ, ఉత్తరాం ధ్ర జిల్లాల్లో ఈ స్కీం అమలుకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఈ స్కీంలో భాగంగా ఆయకట్టు ప్రాంతాల్లో 10 వేల బోర్ వెల్స్‌కు విద్యు త్ కనెక్షన్లు ఇస్తారు. 1,03,681 బోర్ బావులను తవ్వుతారు. ఆయకట్టు లేని ప్రాంతాల్లో 20668 బోర్‌వెల్స్‌ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని విజయానంద్ చెప్పారు. జాతీయ ఉపాధి హామీ పథకం, ట్రాన్స్‌కో, రాష్ట్రప్రభుత్వం, లబ్ధిదారు డు ఇచ్చే నిధులతో రూ.1496.29కోట్లతో ఈ స్కీంను అమలు చేస్తున్నారు. ఈ స్కీం కింద ఏపి ట్రాన్స్‌కో ప్రతి లబ్ధిదారుడికి బోర్‌వెల్ నిమిత్తం రూ.50 వేల సబ్సిడీ ఇస్తుందన్నారు. ఉపాధి హామీ పథకం కింద రూ. 377.15 కోట్లు, ట్రాన్స్‌కో రూ. 621.75 కోట్లు, రాష్ట్రప్రభుత్వం నుంచి రూ.309.13 కోట్లు, లబ్ధిదారుల వాటా రూ. 188.29 కోట్లు కలిపి రూ.1496.29 కోట్లతో ఈ ప్రణాళికను అమలు చేస్తామన్నారు. ఈ సమీక్ష సమావేశంలో గ్రామీణాభివృద్ధి కమిషనర్ బి రామాంజనేయులు, ట్రాన్స్‌కో కమర్షియల్ సిజిఎం కెఎస్‌ఎన్ మూర్తి, గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ కమిషనర్ కెఎస్ వరప్రసాద్, హెచ్‌ఆర్‌డి డైరెక్టర్ పి పుల్లారెడ్డి పాల్గొన్నారు.