ఆంధ్రప్రదేశ్‌

చేజారనున్న ‘జింక్’?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 31: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థగా ఏర్పాటై, తదనంతర కాలంలో ప్రైవేటు చేతుల్లోకి వెళ్లి మూతపడిన ప్రతిష్టాత్మక హిందుస్థాన్ జింక్ కర్మాగారం చివరకు ప్లాట్‌లుగా మారనుంది. గత నాలుగేళ్లుగా మూతపడిన ఈ కార్మాగారాన్ని ప్లాట్లగా విభజించి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని వేదాంత కంపెనీ నిర్ణయించింది. ఈ మేరకు వేదాంత కంపెనీ అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్టు తెలిసింది. విశాఖలో జింక్ కర్మాగారం నెలకొల్పేందుకు అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అవసరమైన భూమిని కేటాయించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడంతో 365 ఎకరాల భూమిని రైతుల నుంచి ప్రభుత్వం సేకరించింది. అన్ని అవాంతరాలను అధిగమించి 1975లో హిందుస్థాన్ జింక్ పేరిట కర్మాగారాన్ని కేంద్రం ప్రారంభించింది. అధికారులతో కలిపి 1,600 మంది ఉద్యోగులు, మరో 1000 మంది కార్మికులు జింక్ కర్మాగారం ద్వారా ఉపాధి పొందుతూ వచ్చారు. ఎంతో లాభాల్లో నడుస్తున్న ఈ కర్మాగారాన్ని అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించాలని నిర్ణయించింది. దీంతో వేదాంత స్టెర్లైట్స్ అనే సంస్థకు వాటాలను విక్రయించారు. 2009లో దాదాపు 71 శాతం షేర్లను వేదాంత సంస్థ దక్కించుకుంది. నాలుగేళ్ల పాటు కార్మాగారాన్ని నడిపిన ఈ సంస్థ ఎలాగైనా మూసివేయాలన్న ఆలోచనకు వచ్చింది. దీనిలో భాగంగా కంపెనీలో ఉద్యోగులకు స్వచ్ఛంధ పదవీ విరమణ (విఆర్‌ఎస్) పథకాన్ని అమలు చేసింది. మూసివేసిన లెడ్ ప్లాంట్‌లోనే 178 మంది కార్మికులకు విఆర్‌ఎస్ అమలు చేసింది. ఇలా ఒకటొకటిగా సంస్థను మూసివేసే పథకాలను అమలు చేస్తూ 2013 నుంచి పూర్తిగా ఉత్పత్తి నిలిపివేసింది. దీంతో ఉద్యోగులు, కార్మికులు రోడ్డున పడ్డారు. విఆర్‌ఎస్ తీసుకోగా మిగిలిన ఉద్యోగులు, కార్మికులకు ఇప్పటికీ వేదాంత కంపెనీ ఎటువంటి పరిహారం చెల్లించలేదు. తాజాగా జింక్ కర్మాగారం ఉన్న ప్రాంతంలో యంత్ర సామాగ్రిని ఒకటొకటిగా తరలించే ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. కర్మాగారం ఉన్న 365 ఎకరాలను ప్లాట్‌లుగా విక్రయించాలని భావిస్తున్నారు. దీనికోసం ప్రభుత్వ అనుమతి కోరుతూ ప్రతిపాదన పంపారు. నాలుగున్నర దశాబ్ధాల కిందట ఎకరాకు కేవలం రూ.850 చెల్లించి రైతుల నుంచి సేకరించిన భూమి విలువ ప్రస్తుతం రూ.1800 కోట్లకు పైమాటే. భూ వినియోగ మార్పిడికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే ఈ విలువైన భూమిని వేదాంత కంపెనీ విక్రయించుకునేందుకు వీలవుతుంది. ఈ ప్రతిపాదన ఎట్టి పరిస్థితుల్లోను ఆమోదించేందుకు వీలు లేదని వామపక్ష పార్టీలు ఇప్పటికే ఆందోళనకు సిద్ధపడ్డాయి. అయితే దీనిపై ఉన్నత స్థాయిలో జరుగుతున్న పరిణామాలు మాత్రం వేదాంతకు అనుకూలంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రతిష్టాత్మక జింక్ కర్మాగారాన్ని రియల్ ఎస్టేట్‌గా మార్చే ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరాదని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ నర్సింగరావు సోమవారం డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన విశాఖ జిల్లా కలెక్టర్‌ను కలసి వినతిపత్రం అందజేశారు.