ఆంధ్రప్రదేశ్‌

శ్రీముఖ లింగంలో మహారాజ యాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జూలై 31: దక్షిణకాశీ అయిన శైవక్షేత్రం, శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలో శ్రీముఖలింగం గ్రామంలో శ్రీముఖలింగేశ్వర స్వామి క్షేత్రంలో సోమవారం అష్టతీర్థ మహారాజ యాగం ప్రారంభమైంది. ఆగస్టు ఏడో తేదీ వరకూ జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా మొదటిగా పులిబండ ఘాట్‌వద్ద దేవాదాయశాఖ, అర్చక సంఘం సంయుక్తంగా పర్లాఖిమిడి మహారాజావారి పేరున ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ ఘట్టాన్ని స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి దంపతులు ప్రారంభించారు. అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే దంపతులు బిందుతీర్థం వద్ద స్నానమాచరించి మహావిష్ణువును దర్శించుకున్నారు. ఈ కార్యక్రమం దేవాదాయశాఖ సహాయక కమిషనర్ శ్యామలాదేవి, ఈవో సూర్యనారాయణ పర్యవేక్షణలో జరిగింది. ఎనిమిది రోజుల పాటు సాగే ఈ ఉత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. 17 ఏళ్ళ క్రితం జరిగిన అష్టతీర్థ మహారాజ యాగం మళ్లీ ఇప్పుడు రావడంతో భక్తులు పునీతులయ్యేందుకు అవకాశం కలిగింది. గత నెలరోజులుగా శ్రీముఖలింగంలో వివిధ ఘాట్ల పనులతోపాటు ఏర్పాట్లు చేశారు.

చిత్రం.. అష్టతీర్థానికి వచ్చిన భక్తులు స్నానాలు ఆచరిస్తున్న దృశ్యం