ఆంధ్రప్రదేశ్‌

ఒకే ఆయకట్టు.. ప్రాజెక్టుల కనికట్టు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 1: గోదావరి ఆధారిత సాగునీటి ప్రాజెక్టుల ద్వారా కొత్త ఆయకట్టు ఎండమావిగానే కన్పిస్తోంది. గోదావరి నది ఆధారంగా ఒకే ఆయకట్టుకు అనేక ప్రాజెక్టులు రూపాంతరం చెందాయి. దీనికి తోడు వివిధ సాగునీటి ప్రాజెక్టుల కాల్వలు తవ్వకంతో ఇప్పటికే సాగులోవున్న భూములు కనుమరుగైన చిత్రమైన పరిస్థితి గోదావరి జిల్లాల్లో చోటుచేసుకుంది. ఈ ప్రాజెక్టుల వల్ల కొత్త ఆయకట్టు రావడం మాటెలావున్నా ఉన్న ఆయకట్టే మాయమయ్యింది.
గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా పుష్కర ఎత్తిపోతల పథకాన్ని మొదలు పెడితే వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో దానిని జలయజ్ఞంలో భాగంగా పూర్తిచేశారు. 2004లో పుష్కర ఎత్తిపోతల పథకం మొదలైంది. దరిమిలా కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1096 కోట్ల అంచనా వ్యయంతో పోలవరం చేపట్టింది. వాస్తవానికి పుష్కర కాల్వను పోలవరం కాల్వగా విస్తరించే అవకాశం ఉన్నప్పటికీ అది వదిలేసి, పోలవరం కోసం ప్రత్యేకంగా భూసేకరణ చేశారు. పుష్కర, తాడిపూడి ఎత్తిపోతల పథకాల కాలువలు తవ్వేటపుడు ఈ రెండు కాలువలు భవిష్యత్తులో పోలవరం కుడి, ఎడమ ప్రధాన కాల్వలుగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. పోలవరం కాలువలు నిర్మించరన్న ఉద్దేశ్యంతోనే అదే అలైన్‌మెంట్‌లో పుష్కర, తాడిపూడి కాల్వలు తవ్వినట్టు చెప్పారు. పుష్కర, తాడిపూడి కాల్వలను వెడల్పు చేసి పోలవరానికి ఉపయోగించి వుంటే వేలాది ఎకరాల భూములు మిగిలేవి. దీనికి తోడు ఖర్చు కూడా తగ్గేది. సాగునీటి ప్రాజెక్టుల కాల్వల మధ్య ఇప్పటికే సాగులోవున్న భూములు నలిగిపోతున్నాయి. ఉదాహరణకు తూర్పు గోదావరి జిల్లాలో 111 కిలో మీటర్ల పొడవునా పుష్కర, పోలవరం కాల్వలను సమాంతరంగా తవ్వారు. ఫలితంగా రైతులు భూములు నష్టపోయారు. పోలవరం కాల్వ కోసం ప్రభుత్వం 7839 ఎకరాలు సేకరించింది. ఇందులో 6,919 ఎకరాలు సాగు భూములే. అదే విధంగా 920 ఎకరాలు ప్రభుత్వం పేదలకు ఇచ్చిన పట్టా భూములు వున్నాయి. ఈ పట్టా భూములను ప్రభుత్వం భూసేకరణలో భాగంగా తిరిగి తీసేసుకుంది. ఈ మూడు పథకాల వల్ల భూములు కోల్పోయిన రైతులు వ్యవసాయానికి దూరమై వ్యవసాయ కూలీలుగా మారారు. దాదాపు 17 ఏళ్లుగా రైతులు ఉపాధి కోల్పోయారు. అయినప్పటికీ పోలవరం ప్రాజెక్టు ఇంకా అందుబాటులోకి రాలేదు సరికదా, అంతకంటే ముందు ప్రారంభమైన పుష్కర పథకం కూడా పూర్తిస్థాయిలో సాగు నీరు అందించలేకపోయింది. ఈ కాలువల తవ్వకంవల్ల సహజంగావున్న కాలువలు, బోరు బావులు, బావులు, చెరువులు అంతర్థానమయ్యాయి. పోలవరం ద్వారా నికర జలాలతో 7.20 లక్షల ఎకరాలు సాగు చేసేందుకు నిర్దేశించారు. దీనిలో సుమారు 4 లక్షల ఎకరాలకు ఇప్పటికే తాడిపూడి, పుష్కర ఎత్తిపోతల పథకాల ద్వారా సాగు నీరు అందిస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. అయితే పోలవరం ద్వారా 10.5 లక్షల ఎకరాల గోదావరి డెల్టా రబీకి సాగునీటి గ్యారంటీ లభిస్తుంది. దాదాపు రూ.1200 కోట్ల అంచనా వ్యయంతో పుష్కర, తాడిపూడి నిర్మించి సమాంతర కాల్వలతో సాగులో వున్న భూములను చిధ్రం చేశారని తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టులో నిర్దేశించిన ఆయకట్టులో కొంత మేర ఇప్పటికే బోర్లు, బావుల కింద సాగవుతోంది. ఇటు పుష్కర, తాడిపూడి, అటు బోర్లు, బోరు బావుల ఆయకట్టు మినహాయిస్తే ఇక దాదాపు లక్ష ఎకరాల వరకు నికరంగా పోలవరం ద్వారా ఆయకట్టు లభించవచ్చని తెలుస్తోంది. అయితే ప్రధానంగా పారిశ్రామిక అవసరాలు ఈ ప్రాజెక్టులో నిబిడీకృతమై ఉన్నాయని చెప్పొచ్చు. మరో విషయమేమిటంటే దాదాపు 1.55 లక్షల ఎకరాల ఆదివాసీల సారవంతమైన భూములు, అటవీ భూములు ముంపునకు గురవుతున్నాయి.