ఆంధ్రప్రదేశ్‌

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఆగస్టు 1: వివిధ రాష్ట్రాల్లో లారీల దొంగతనాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా నాయకుడిని వన్‌టౌన్ పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయమై మంగళవారం సిఐ చంద్రశేఖరరావు విలేఖరులతో మాట్లాడుతూ సిసిఎస్ పోలీసుల సహకారంతో ముఠాలో కీలకమైన వ్యక్తి జగన్నాథరావును అరెస్టు చేశామన్నారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గడికొయ్య రామకోటిరెడ్డి, విజయవాడకు చెందిన శ్రీనివాసరావు, కాకినాడకు చెందిన కాటూరి కిశోర్‌బాబు, తణుకుకు చెందిన బొక్కా రాఘవులు, శ్రీకాకుళానికి చెందిన గుంటి జగన్నాథరావు, కడప జిల్లాకు చెందిన వురియా వీర వసంతకుమార్ ముఠాగా ఏర్పడి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీలను పట్టుకెళ్లిపోయి విడిభాగాలుగా విడగొట్టి వాటిని విజయవాడ పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారని తెలిపారు. సిసిఎస్ డిఎస్పీ చక్రవర్తి అందించిన సమాచారం మేరకు నిందితుడ్ని పట్టుకోగలిగామని చెప్పారు. మిగిలినవారు పరారీలో ఉన్నారన్నారు.

చిత్రం.. వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు