ఆంధ్రప్రదేశ్‌

కుదిపేస్తున్న క్రికెట్ బెట్టింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఆగష్టు 1: క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న అంతర్జాతీయ క్రికెట్ బుకీని పది రోజుల కిందట నెల్లూరు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విచారణలో అతను పోలీసులకు అందిస్తున్న సమాచారం ఆధారంగా జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులను ఒక్కొక్కరిగా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాను ఈ బెట్టింగ్ కేసు వ్యవహారం కుదిపేస్తోంది. జిల్లా ఎస్పీగా పి హెచ్ డి రామకృష్ణ బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజులకే నెల్లూరు నగరానికి చెందిన ఓ కుటుంబం మొత్తం తమిళనాడు రాష్ట్రం రామేశ్వరంలో మూకుమ్మడిగా ఆత్మహత్యకు పాల్పడింది. తమ చావుకు క్రికెట్ బెట్టింగ్‌లో జరిగిన నష్టం, తదనంతరం కొందరు బుకీల బెదిరింపులు కారణమంటూ వారు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. ఈ సంఘటనను ఆధారంగా జిల్లా పోలీస్ శాఖ ఈ కేసు దర్యాప్తు చేస్తోంది. జిల్లాలో ఇక బెట్టింగ్ అనే పదం వినిపించకుండా చేయాలనే తలంపుతో కఠిన చర్యలకు దిగింది. కొద్ది రోజుల్లోనే ఏళ్ల తరబడి తప్పించుకు తిరుగుతున్న ప్రధాన బుకీ కృష్ణసింగ్‌ను అదుపులోకి తీసుకొని అతనిచ్చిన సమాచారం మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న బుకీలను కూడా అదుపులోకి తీసుకొన్నారు. వారిలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు , పోలీసులు ఉండడం గమనార్హం. ఇటీవల హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో నెల్లూరుకు చెందిన ప్రముఖులు ఉండగా వారిని అదుపులోకి తీసుకొని నెల్లూరుకు తీసుకువచ్చారు. వారిలో నెల్లూరు కార్పొరేషన్ వైకాపా ఫ్లోర్ లీడర్ కూడా ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో ఎన్ని ఒత్తిళ్లు వస్తున్నా జిల్లా ఎస్పీ మాత్రం తన పని తాను చేసుకుపోతుండడంతో జిల్లా సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
పలువురు పోలీసుల ప్రమేయం
ఈ కేసులో పలువురు పోలీస్ సిబ్బంది ప్రమేయం కూడా ఉన్నట్లు జిల్లా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. జిల్లాలో పనిచేసి వెళ్లిన ఇద్దరు డిఎస్పీ స్థాయి అధికారులతో పాటు మరికొందరు సిఐలు కూడా కృష్ణసింగ్ దగ్గర నజరానాలు తీసుకునే వారని, అతని కార్యకలాపాలకు ఎటువంటి ఆటంకం జరగకుండా తమ వంతు సహాయం అందించేవారని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ విషయాలను జిల్లా ఎస్పీతో పాటు ఏ అధికారి కూడా ఇప్పటివరకూ నిర్ధారించలేదు. అయితే గత పది రోజులుగా జిల్లాలోని పలు పట్టణాల్లో పోలీస్‌లు దాడులు నిర్వహిస్తూ బెట్టింగ్‌కు పాల్పడే పలువురిని అదుపులోకి తీసుకుంటూ రహస్య విచారణ ప్రదేశానికి తరలిస్తున్నారు. ఈ దాడులకు భయపడి జిల్లా వదిలి పారిపోయిన బుకీలను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.