ఆంధ్రప్రదేశ్‌

జాతీయ ఇంధన పొదుపు ప్రచార కమిటీ కన్వీనర్‌గా చంద్రశేఖరరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. రాష్ట్ర ఇంధన పొదుపు ప్రచార కమిటీకి కన్వీనర్, సీఆర్‌డిఏ ఇంధన శాఖ మీడియా సలహాదారుగా ఉన్న చంద్రశేఖరరెడ్డిని జాతీయ ఇంధన పొదుపు ప్రచార కమిటీ కన్వీనర్‌గా నియమిస్తూ కేంద్ర ఇంధన శాఖ ఉత్తర్వులిచ్చింది. ఈ కమిటీ అన్ని రాష్ట్రాల్లోనూ ఇంధన పొదుపు ఏ విధంగా అమలుచేయాలి? వాటికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలను ఏ రూపాల్లో నిర్వహించాలన్న అంశంపై ఆయా ప్రభుత్వాలకు మార్గదర్శకాలు సూచిస్తుంది. దానికోసం దేశంలోని ఒక్కో రాష్ట్రంలో నెలకోసారి సమావేశం నిర్వహిస్తుంది.