ఆంధ్రప్రదేశ్‌

‘రూ.15వేల కోట్ల కేంద్ర నిధులే లక్ష్యం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 1: కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ పథకాలకు సంబంధించి నిధులను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15వేల కోట్ల రూపాయలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. కేంద్ర నిధుల వినియోగానికి సంబంధించి యుటిలైజేషన్ సర్ట్ఫికెట్లను ఎప్పటికప్పుడు కేంద్రానికి సమర్పించాలని స్పష్టం చేశారు. తద్వారా కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో నిధులను రాబట్టుకోవచ్చని చెప్పారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతీయ సంస్థల ఏర్పాటుకు సంబంధించి నిధుల విడుదల, వినియోగంపై చర్చించారు. జాతీయస్థాయిలో ఆర్థిక సంవత్సరాన్ని మార్చనుండటం, బడ్జెట్‌ను ముందుగా ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. జాతీయ సంస్థల ఏర్పాటుకు సంబంధించి భూ కేటాయింపుల విషయంలో ఎటువంటి జాప్యం జరగడానికి వీలులేదని చెప్పారు. ఈ విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. 2016-17లో రూ. 10,400 కోట్లు వివిధ పథకాలకు సంబంధించిన కేంద్రం నుంచి వచ్చాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.15వేల కోట్లు వచ్చేలా అధికారులు పనిచేయాలని ఆదేశించారు. ప్రతి రూపాయిని ఖర్చుచేయడం, దానికి సంబంధించిన యుటిలైజేషన్ సర్ట్ఫికెట్‌ను వెంటనే కేంద్రానికి పంపేలా ఆయా శాఖల ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఈ విషయంలో జిల్లాస్థాయి అధికారులతోనూ తరచు సమీక్షలు నిర్వహించాలని చెప్పారు. కేంద్ర పథకాలకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధుల విడుదలలో జాప్యం లేకుండా చూడాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.రవిచంద్రకు సూచించారు.ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు డాక్టర్ మన్మోహన్‌సింగ్, బి.రాజశేఖర్, ముఖ్య కార్యదర్శులు ఎఆర్ అనురాధ, అజయ్ జైన్, కె.జవహర్‌రెడ్డి, పూనం మాలకొండయ్య, ఆర్‌పి సిసోడియా, ఎస్‌ఎస్ రావత్, సాల్మన్ ఆరోఖ్యరాజ్, కార్యదర్శులు శశిభూషణ్‌కుమార్ పాల్గొన్నారు.