ఆంధ్రప్రదేశ్‌

తాగునీటి సరఫరా కార్పొరేషన్ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 1: రాష్ట్రంలో 24 వేల పైచిలుకు ఆవాసాల్లో మంచినీటిని సరఫరా చేసేందుకు వీలుగా ఎపి తాగునీటి సరఫరా కార్పొరేషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకూ 23,480 ఆవాస ప్రాంతాల్లో రోజుకు తలసరి 55 లీటర్లను సరఫరా చేస్తున్నారు. ఇంకా 24,405 ప్రాంతాల్లో అరకొరగా మంచినీరు సరఫరా చేస్తున్నారు. పంచాయితీల పరిధిలోని మంచినీటి పథకాల నిర్వహణ, పన్నుల వసూలు వంటి అంశాల్లో అనేక సమస్యలు ఉంటున్నాయి. నిధుల కొరత కారణంగా ఇప్పటికే ఉన్న తాగునీటి వనరులను మరింత పటిష్టం చేసేందుకు కొత్త వనరులను సమకూర్చుకోవటం పంచాయితీలకు ఆర్థిక భారంగా పరిణమిస్తోంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని తలసరి రోజుకు 100 లీటర్లను అందచేందుకు ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు కలిగిన నీటిని, సగటున ఒక వ్యక్తికి రోజుకు 70 లీటర్లు, 24 గంటలు సరఫరా చేసేందుకు వీలుగా ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి చైర్మన్‌గా వ్యవహరించే ఈ కార్పొరేషన్‌లో పంచాయితీరాజ్ మంత్రి ఉపాధ్యక్షునిగా, డైరెక్టర్లుగా పంచాయితీరాజ్, ఫైనాన్స్, రెవెన్యూ, ఎనర్జీ, పురపాలక, రహదారులు, భవనాలు, హడ్కొ, గ్రామీణ నీటి సరఫరా తదితర శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు వ్యవహరిస్తారు. గ్రామాల్లో, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా వ్యవహారాలను ఈ కార్పొరేషన్ చూస్తుంది.