ఆంధ్రప్రదేశ్‌

పింగళికి చంద్రబాబు నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 1: సగర్వంగా రెపరెపలాడే మన జాతీయ జెండాను చూసినంతనే త్రివర్ణ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య స్ఫురణకు వస్తారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాళులర్పించారు. దేశభక్తుడు అనే మాటలకు పింగళి నిజమైన నిర్వచనమని కొనియాడారు. బుధవారం పింగళి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఆయనకు నివాళి అర్పించారు. పింగళి 1876 ఆగస్టు 2న కృష్ణాజిల్లా భట్లపెనుమర్రులో జన్మించారన్నారు. ఆంధ్రప్రదేశ్‌కే కాక, దేశానికే ముద్దుబిడ్డ అని, తుది శ్వాసదాకా విలువలకు నిబద్ధుడై, నిజాయితీగా జీవించారని చంద్రబాబు కొనియారు. 19ఏళ్ల వయస్సులోనే బ్రిటీష్ ఇండియన్ ఆర్మీలో చేరారని, ఆఫ్రికాలో జరిగిన ఆంగ్లో-బోయర్ యుద్ధంలో పాల్గొన్నారని చెప్పారు. పింగళి వెంకయ్యకు ఆనాడు మహాత్మునితో ఏర్పడిన తొలి పరిచయం ఐదు దశాబ్దాలు కొనసాగిందని అన్నారు. పింగళి వెంకయ్య మహాత్ముని అభిమానం పొంది, ఆయన సూచనలతో జాతీయ జెండాకు రూపకల్పన చేసిన ధన్యజీవి అని శ్లాఘించారు.