ఆంధ్రప్రదేశ్‌

నెలలో భూమి కేటాయింపు : లోకేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 1: చిత్తూరు జిల్లా రేణిగుంటలోని ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్-2కు నెల రోజుల్లో భూమి కేటాయిస్తామని రాష్ట్ర ఐటిశాఖ మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి లోకేష్‌ను రేణిగుంట ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్-2 ప్రతినిధులు మంగళవారం కలిశారు. క్లస్టర్-2లో వౌలిక సదుపాయాలు, భూమి కేటాయింపులు త్వరగా చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నెల రోజుల్లో భూముల కేటాయింపులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా వౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. రాబోయే రెండు సంవత్సరాల్లో ఐటిలో లక్ష, ఎలక్ట్రానిక్స్ రంగంలో మరో లక్ష ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. డ్రోన్ల సాయంతో క్లస్టర్-2లో పనులు పర్యవేక్షిస్తామని, ఉద్యోగాల కల్పనలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. దేశంలో తయారవుతున్న 10 ఫోన్లలో 3 రాష్ట్రంలోనే తయారవుతున్నాయని, రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ కంపెనీల ఏర్పాటుకు అనువైన వాతావరణం ఉందన్నారు.