ఆంధ్రప్రదేశ్‌

మూడేళ్ల కష్టం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 1: మూడేళ్ల నుంచి ఉద్యోగులతో సఖ్యతగా మెలిగి, వారికి కోరినన్ని వరాలిచ్చి మెప్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కష్టం కేవలం మూడు రోజుల నుంచి జరుగుతున్న దుష్ప్రచారం వల్ల నష్టపోయే పరిస్థితి వచ్చిందన్న ఆవేదన టిడిపి వర్గాల్లో వ్యక్తమవుతోంది. గత మూడు రోజుల నుంచి వైసిపి అనుకూల మీడియాలో ఉద్యోగుల వయో పరిమితిపై జరుగుతున్న ప్రచారంపై ఎదురుదాడి చేయటంలో మంత్రులు, అధికారులు విఫలమయ్యారన్న ఆగ్రహం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మూడు రోజుల క్రితం ఉద్యోగుల వయోపరిమితిని తగ్గిస్తున్నారని జగన్ మీడియా ప్రచారం ప్రారంభించిందని, దాంతో అప్పటివరకూ ముఖ్యమంత్రి పట్ల సానుకూలంగా వ్యవహరించిన ఉద్యోగులు ఒక్కసారిగా వ్యతిరేకంగా మారిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని పార్టీ నేతలు వాపోతున్నారు. తాము అసలు అటువంటి ప్రతిపాదనలు సిద్ధం చేయలేదన్నా వారు నమ్మడం లేదని, గతంలో తమ పట్ల వ్యవహరించిన రీతిలోనే ఆయన మళ్లీ వ్యవహరిస్తున్నారన్న అనుమానాలు ఈ ప్రచారానికి కారణమైందని విశే్లషిస్తున్నారు. ఈ ప్రచారాన్ని ఎదుర్కోవడంలో యంత్రాంగమంతా విఫలమైందని విమర్శిస్తున్నారు. ‘ఇదంతా సిఎంవో అధికారుల వైఫల్యమే. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు రూల్స్‌ను ఇక్కడ కూడా వర్తింప చేస్తామనే లీకులు ఇవ్వడమే దీనంతటికి కారణం. సిఎంవోలో కీలకంగా పనిచేసే అధికారి వల్లే ఇదంతా జరిగిందని’ పార్టీ సీనియర్ ఒకరు వ్యాఖ్యానించారు. ‘కేంద్ర సర్వీసు రూల్స్‌ను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తామని ప్రభుత్వం ఎక్కడా పేర్కొనలేదు. కేవలం అవినీతి, అక్రమాలకు పాల్పడి వందల కోట్ల రూపాయలు సంపాదించిన ఉద్యోగులపై ఏ విధంగా చర్యలు తీసుకోవాలన్న విషయంపైనే చర్చ జరిగింది. ఎసిబి దాడుల్లో వందల కోట్ల ఆస్తులు సంపాదించిన ఉద్యోగులను బలవంతంగానైనా పదవీ విరమణ చేయించాలన్న ఆలోచన అది. దీనివల్ల అటు ఎసిబి దాడుల్లో దొరికిన ఉద్యోగులకు కూడా లాభం ఉంటుంది. ఎసిబి దాడుల్లో దొరికితే జైలు జీవితం, తరువాత కోర్టు కేసులతో రావాల్సిన ప్రయోజనాలు రాకుండా పోతాయి. అదే బలవంతంగా పదవీ విరమణ చేయిస్తే వారికి రావాల్సిన ప్రయోజనాలు మొత్తం వస్తాయి. ఇది అటు ప్రభుత్వానికి ఇటు ఉద్యోగికి ఉభయతారకంగా ఉంటుంది. పనిచేయని ఉద్యోగిని ప్రభుత్వం భరాయించాల్సిన అవసరం లేదు. అయితే ప్రభుత్వం ఆలోచించింది ఒకటైతే, జరిగిన ప్రచారం మరొకటి. దీంతో మూడేళ్లు ఉద్యోగులతో సఖ్యతగా వ్యవహరిస్తూ సిఎం పడిన శ్రమ వృథా అయింది’ అని ఓ మంత్రి వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా చంద్రబాబు కళ్లు తెరచి సిఎంవోను సమూల ప్రక్షాళన చేయకపోతే పరిస్థితి చేయి దాటిపోతుందని హెచ్చరిస్తున్నారు.