ఆంధ్రప్రదేశ్‌

స్కూళ్లలో సౌకర్యాలకు రూ.4848 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 1: రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని, వాటికి పూర్తిస్థాయిలో ఏ కొరత లేకుండా నీటి సౌకర్యాన్ని కల్పించాలని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విద్యాశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో వౌలిక వసతులపై మంగళవారం వెలగపూడి సచివాలయంలో ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పాఠశాలలో గతంలో యుద్ధప్రాతిపదికన మరుగుదొడ్ల సౌకర్యం కల్పించి, వాటికి నిరంతరం నీటిని అందించే ఏర్పాట్లు చేసినా కొంతమంది అధికారులు, ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. పాఠశాలల్లో విద్యార్థినుల శాతం తగ్గుతోందంటే దానికి కారణం మరుగుదొడ్లు లేకపోవడమేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. మరుగుదొడ్లలో నీటి వసతికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకునే దిశగా పూర్తిస్థాయి చర్యలు చేపట్టాలని కమిషనర్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. ప్రభుత్వం పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా 4,848 కోట్లు వెచ్చిస్తున్నామని, పాఠశాలల్లో పూర్తిస్థాయి వౌలిక సదుపాయాలు, భవన నిర్మాణాల కోసం ఈ నిధులు ఖర్చు చేయనున్నామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. పాఠశాలల్లో నెలలోపు మరిన్ని వౌలిక సదుపాయాలు కల్పించే దిశగా ఈ నిధులు వివిధ పనుల కోసం ఖర్చు చేయనున్నామన్నారు. ఆదర్శ పాఠశాలల బాలికల వసతి గృహాలు ఈ వారంలోగా ప్రారంభించే ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. 163 ఆదర్శ పాఠశాలలకు అనుబంధంగా బాలికల వసతి గృహాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు.