ఆంధ్రప్రదేశ్‌

బాబు మాటలు నమ్మవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఆగస్టు1: ‘ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పే అబద్ధాలు నమ్మవద్దు... ఆయనతో కలసి ప్రయాణం చేసి మీ పరపతిని తగ్గించుకోకండి’ అని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌కు సూచించారు. ఈమేరకు పవన్‌కళ్యాణ్‌కు మంగళవారం ఒక బహిరంగ లేఖ రాశారు. లేఖ ప్రతులను ఆయన మీడియాకు విడుదల చేశారు. ఇప్పటికే ఎన్నో వర్గాల వారికి చంద్రబాబు హామీల వర్షం కురిపించారని, అవన్నీ నీటి మీద రాతల వంటివని లేఖలో పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి ఇచ్చిన 30 జిఒను హైకోర్టు ఫుల్ బెంచ్ కొట్టివేసినట్టు మీతో చంద్రబాబు అబద్ధమాడుతున్నారని ముద్రగడ స్పష్టంచేశారు. కాపులకు బిసి రిజర్వేషన్ల కోసం ఉద్యమకారులు వత్తిడి చేస్తున్నట్టు ముఖ్యమంత్రి మీవద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టుగా ఆయన పెంపుడు పత్రికలు రాయడం విచిత్రంగా ఉందన్నారు. కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వం కాపుల కోసం జిఒ నెం.30ని సక్రమంగానే ఇచ్చినట్టు కోర్టు ఇచ్చిన తీర్పును 1995 ఏప్రిల్ 7వ తేదీన పత్రికల్లో రాశారని, ఆ పత్రిక నకళ్ళు పంపుతున్నానని, పరిశీలించాలని సూచించారు. 2016 ఫిబ్రవరి 8న కిర్లంపూడిలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ 2016 ఆగస్టులోగా కమిషన్ నివేదిక రప్పించుకుని, అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి 9వ షెడ్యూల్‌లో పెట్టమని పంపనున్నట్టు హామీనిచ్చారని పేర్కొన్నారు. కమిషన్ రిపోర్ట్ కోసం 7 మాసాలు ఆగలేరా? అని తమను ఎన్నో విధాలుగా వంచించారని పేర్కొన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3సంవత్సరాలైనా, కమిషన్‌ను నియమించి 18 నెలలైనా, పల్స్ సర్వే పూర్తయ్యి సంవత్సరం దాటినా నిత్యం అబద్ధాలతో కాలం గడుపుతున్నారని లేఖలో పేర్కొన్నారు. అబద్ధాలు చెప్పడానికి వారికి సిగ్గులేకపోయినా, వినడానికి మాత్రం కాపు జాతి సిగ్గు పడుతోందన్నారు. మాకు చెప్పిన అబద్ధాలు మీకు తెలియడం కోసం ఈ లేఖ రాయాల్సి వచ్చిందని ముద్రగడ పేర్కొన్నారు.
రేపటి నుంచి పాదయాత్రకు ముద్రగడ సన్నద్ధం
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం గృహ నిర్బంధం మంగళవారం ఏడవ రోజుకు చేరింది. ఆయనపై విధించిన గృహ నిర్బంధం బుధవారంతో పూర్తికానున్న నేపథ్యంలో గురువారం నుంచి పాదయాత్రకు ముద్రగడ సన్నద్ధమవుతున్నారు. కాపులను బిసిల్లో చేర్చాలనే డిమాండుతో చలో అమరావతి పేరుతో గత నెల 26 నుంచి ఆయన పాదయాత్రకు ఉపక్రమించిన సంగతివిదితమే. దాన్ని అడ్డుకున్న పోలీసులు 24 గంటల గృహ నిర్బంధం విధించారు. 27న మళ్లీ పాదయాత్రకు బయలుదేరిన ఆయనను అడ్డుకుని వారం రోజులు గృహ నిర్బంధం విధిస్తున్నట్టు ప్రకటించారు. దీనితో మొదటి రోజుతో కలిపి మంగళవారం నాటికి గృహనిర్బంధం ఏడు రోజులకు చేరగా, వారం రోజుల గృహ నిర్బంధం బుధవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో గురువారం నుంచి పాదయాత్ర ప్రారంభించడానికి ఆయన సన్నద్ధమవుతున్నారు. ముందుగా ప్రకటించినట్టు ఈనెల 3వ తేదీ నుండి నిరవధిక పాదయాత్ర ప్రారంభిస్తానని ముద్రగడ ప్రకటించారు.