ఆంధ్రప్రదేశ్‌

ఉద్యోగుల వయోపరిమితి తగ్గించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, ఆగస్టు 1: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి తగ్గించే ప్రసక్తే లేదని ఉప ముఖ్యమంత్రి కెయి.కృష్ణమూర్తి స్పష్టం చేశారు. అదంతా వైకాపా తమ సొంత పత్రిక సాక్షి, ఛానల్‌లో చేసిన దుష్ప్రచారమేనన్నారు. అవాస్తవాన్ని పట్టుకుని ఉద్యోగస్తుల్లో ఆందోళన కలిగించేందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో గెలిచిన వెంటనే తెలుగుదేశం ప్రభుత్వం ఉద్యోగుల వయోపరిమితిని 58 నుండి 60 ఏళ్లకి పెంచిందన్నారు. ఈ ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. అయితే వయో పరిమితి తగ్గిస్తున్నట్లు ప్రభుత్వంపై బురదచల్లే కార్యక్రమం వైకాపా చేపడుతోందని తీవ్రంగా దుయ్యబట్టారు. ఉద్యోగుల కడుపుకొట్టే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత మాత్రం లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓవైపు అమరావతిని ప్రపంచంలోనే మేలైన రాజధానిగా చేయాలనే తపనతో పనిచేస్తూ, దివంగత ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి హామీలను పూర్తిచేసేందుకు నంద్యాలకు రూ.1500 కోట్ల నిధులను మంజూరు చేస్తే అదంతా అవినీతి కోసం చేస్తున్నారని వైకాపా తన మానసపుత్రిక సాక్షి పత్రిక, ఛానల్ ద్వారా బురదచల్లే కార్యక్రమం చేపట్టిందన్నారు. అవినీతిలో మునిగి తేలుతున్నది ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందేనన్నారు. వైకాపా నాయకుడు ధర్మాన ప్రసాదరావు మాజీ సైనికులకు ఇచ్చిన 50 ఎకరాల భూమిని కబ్జా చేసిన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సాక్షాధారాలతో సహా నిరూపించిందన్నారు. వైకాపా నేతలంతా అవినీతిలో మునిగితేలిన వారేనని ఆరోపించారు. అభివృద్ధిని అడ్డుకోవడమే జగన్ నైజమని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఇక్కడ ఉద్యమాలు చేస్తూ ప్రధాని మోదీ కాళ్లపై పడడం ఆయన మనస్థత్వానికి అద్దం పడుతోందన్నారు. అబద్దాల పుట్టగా రూపొందించిన పుస్తకాన్ని ప్లీనరీలో విడుదల చేశారన్నారు. టిడిపి సంక్షేమ పథకాలను కాపీ కొట్టి నవరత్నాలుగా మార్చి తాము అధికారంలోకి వస్తే వాటిని అమలు చేస్తామనడం హాస్యాస్పదమన్నారు.