ఆంధ్రప్రదేశ్‌

ఒకే టీకా మంచి విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 1: తట్టు, రూబెల్లా వ్యాధుల నిర్మూలనకు చేపట్టిన ఒకే టీకా విధానం మేలైనదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉండవల్లిలోని తన నివాసం వద్ద వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తట్టు, రూబెల్లా టీకాలు వేసే కార్యక్రమాన్ని ఆయన మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇవి అంటువ్యాధులని, ప్రాణాంతక వ్యాధులన్నారు. తట్టు వల్ల అంగవైకల్యం, కొన్ని సందర్భాల్లో మరణం సైతం సంభవిస్తుందన్నారు. ఈ వ్యాధుల నిర్మూలనకు ఒకే టీకా ఇచ్చే కార్యక్రమం ప్రారంభించడం మంచిదన్నారు. కేంద్ర ప్రభుత్వం, యునిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, తదితర సంస్థల సహకారంతో టీకాలు వేసే కార్యక్రమం చేపట్టామన్నారు. సెప్టెంబర్ 8 వరకూ అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 9 నెలల నుంచి 15 సంవత్సరాల పిల్లలకు ఈ టీకాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 1.2 కోట్ల మందికి ఈ టీకాలను ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 5 రాష్ట్రాల్లో ప్రారంభించారని, ఎపి సహా మరో 8 రాష్ట్రాల్లో ఈ టీకాలను ఇప్పుడు ఇస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో తల్లితండ్రులు అందరూ పాల్గొని పిల్లలకు ఈ టీకాలను వేయించాల్సిందిగా సిఎం పిలుపునిచ్చారు. వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్వయంగా ఒక బాలికకు టీకా వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

చిత్రం.. తట్టు, రూబెల్లా టీకా వేస్తున్న మంత్రి కామినేని