ఆంధ్రప్రదేశ్‌

బడాబాబులకు వత్తాసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 3: రైతులు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణం మంజూరు చేసేందుకు ముందుకు రాని బ్యాంకులు బడా పారిశ్రామికవేత్తలకు పెద్ద ఎత్తున రుణాలు ఎలా మంజూరు చేస్తున్నాయని తెలుగుదేశం సభ్యుడు అవంతి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అవంతి శ్రీనివాస్ గురువారం లోక్‌సభలో బ్యాంకింగ్ రెగ్యులేషన్ సవరణ బిల్లుపై మాట్లాడుతూ రైతులు, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పట్ల బ్యాంకులు తమ వైఖరిని మార్చుకోవాలని సూచించారు. బడా పారిశ్రామికవేత్తలకు పెద్ద ఎత్తున సహాయం చేస్తున్న బ్యాంకులు రైతులు, చిన్న దుకాణాల వారికి ఉదారంగా రుణాలు మంజూరు చేయాలని అవంతి శ్రీనివాస్ సూచించారు. ఎం.ఎస్.ఎం.ఈ, విద్యార్థులకు రుణ మంజూరు పెరగాలని ఆయన డిమాండ్ చేశారు. బ్యాంకుల నుండి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని దురుద్దేశంతో డిఫాల్టర్లుగా మారిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ఎన్.పి.ఏను పెంచుకుంటున్న బ్యాంకులపై చర్యలు తీసుకునేందుకు వీలుగా ఆర్.బి.ఐకి మరిన్ని అధికారాలు ఇవ్వాలని వైకాపా సభ్యుడు వెలగపల్లి ప్రసాదరావు కేంద్ర ఆర్థిక మంత్రికి సూచించారు. దేశంలోని కార్పొరేట్ సంస్థలు బ్యాంకులకు రుణాలు చెల్లించకుండా బీద ప్రజల పొదుపును స్వాహా చేస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. ఐ.ఓ.బి ఎన్.పి.ఏ 22 శాతం, పాటియాలా బ్యాంకు ఎన్.పి.ఏ 19 అంటూ ఇలాంటి బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకుంటేనే బీద ప్రజల పొదుపుకు భద్రత లభిస్తుందన్నారు. దురుద్దేశంతో రుణాలు చెల్లించని వారి సంఖ్య పెరుగుతోంది, పది సంవత్సరాల క్రితం ఇలాంటి వారి సంఖ్య కేవలం 1,600 ఉంటే ఇప్పుడు వీరి సంఖ్య 8000 పెరిగిందని ఆయన చెప్పారు.