ఆంధ్రప్రదేశ్‌

జన్మభూమి కమిటీలు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 3: పార్టీకి తలనొప్పిలా పరిణమించిన జన్మభూమి కమిటీలను రద్దు చేస్తూ తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీల్లోని సభ్యులు లబ్ధిదారుల వద్ద డబ్బులు తీసుకోవం వల్ల స్థానికంగా పార్టీకి అప్రతిష్ఠ వస్తున్నందున, వాటిని రద్దు చేయాలని చాలాకాలం నుంచీ బాబుపై ఒత్తిళ్లు వస్తున్నాయి. ఒక దశలో ఆయన జన్మభూమి కమిటీలను రద్దు చేద్దామని ప్రయత్నించినా, మంత్రులు స్థానికంగా తమకు కార్యకర్తలతో ఇబ్బందులుంటాయని చెప్పి బాబు ప్రయత్నానికి గండికొట్టారు. తాజాగా గురువారం జరిగిన తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో జన్మభూమి కమిటీలు రద్దు చేస్తున్నట్లు చంద్రబాబునాయుడు ప్రకటించారు. అదీగాక ఆ కమిటీల కాలపరిమితి కూడా ముగిసింది. అయితే కొత్త విధివిధానాలతో మళ్లీ కమిటీలు వేస్తారా? లేక కొత్త వారికి స్థానం కల్పిస్తారా? అన్నది ఇంకా ఖరారు కాలేదు. కాగా, సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షులు చాలామంది రాకపోవడం, మరికొందరు ఆలస్యంగా రావడంపై బాబు విరుచుకుపడ్డారు. పనులు ఉండటం వల్ల రాలేకపోయామన్న కారణాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏం.. మీకేనా పనులు.. నాకేమీ పనులు లేక నేనిక్కడ కూర్చున్నాననుకుంటారా.. మీకెవరికీ క్రమశిక్షణ లేకుండా పోయింది. పనులున్న వారిని పనులే చేసుకోమనండి.. కొత్త వారితో పనిచేయిద్దామ’ని తీవ్ర స్వరంతో ఆగ్రహం వ్యక్తం చేయగా, ఇకపై సమయానికి వస్తామని వారు బాబుకు క్షమాపణ చెప్పినట్లు సమాచారం. ఉద్యోగుల వయోపరిమితిపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంపై ఎదురుదాడి చేయాలని ఆదేశించారు. ఇటీవల తనను పవన్ కల్యాణ్ కలిసిన వైనాన్ని బాబు పార్టీ జిల్లా అధ్యక్షులు, మంత్రులకు వివరించారు. పవన్ ఒక్కరే కాదు.. ఎవరు వచ్చి మంచి సూచనలు చేసినా మనం పాటిస్తాం.. పవన్ చేస్తున్నది మంచి పని అయినప్పుడు ఆయన సూచనలను గౌరవించడంలో తప్పేముంది అని బాబు వ్యాఖ్యానించినట్లు తెలిసింది.