ఆంధ్రప్రదేశ్‌

‘ ఫాతిమా’ విద్యార్థులకు న్యాయం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 3: కడప జిల్లా ఫాతిమా మెడికల్ కళాశాల విద్యార్థులకు న్యాయం చేస్తామని టిడిపి కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయమై కేంద్ర మంత్రి నడ్డాతో, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసిఐ)తో చర్చించామని తెలిపారు. సిఎం ఆదేశాల మేరకు 50 మంది విద్యార్థులతో ఢిల్లీలో మంత్రిని, ఎంసిఐ అధికారులను కలిశామన్నారు. త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామని వారు హామీ ఇచ్చారన్నారు. రాష్ట్రంలోని వివిధ వైద్య కళాశాలల్లో నలుగురేసి ఫాతిమా విద్యార్థుల చొప్పున చేర్చేలా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. కానీ ఇందుకు ఎంసిఐ అనుమతి కావాల్సి ఉంటుందన్నారు. ఈ అంశంపై పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించామని, మంత్రిమండలి సమావేశంలో కూడా చర్చిస్తామన్నారు. ప్రభుత్వం తరపున అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇందులో కళాశాల యాజమాన్యం తప్పిదం కూడా ఉందని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు చెల్లించిన ఫీజులు వెనక్కి చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.