ఆంధ్రప్రదేశ్‌

సిఎస్ దృష్టికి మెడ్‌టెక్ జోన్ వ్యవహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 3: విశాఖలో ఏర్పాటు చేస్తున్న ఎపిమెడ్‌టెక్ జోన్ నిర్మాణంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయంటూ ఆ సంస్థ మాజీ ఉద్యోగి జుడిష్‌రాజ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సిఎస్) దినేష్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. వెలగపూడి సచివాలయంలో ఆయన గురువారం సిఎస్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు. 500 కోట్ల రూపాయల అంచనాలతో రూపొందించినప్పటికీ, 2400 కోట్ల రూపాయలకు టెండరు ఖరారు చేశారని తెలిపారు. కాగా, మెడ్‌టెక్ జోన్ నిర్మాణానికి సంబంధించి వస్తున్న ఆరోపణలను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఖండించారు. ప్రభుత్వానికి అప్రతిష్ఠ తెచ్చేలా, అనైతిక విధానాలకు పాల్పడుతుండటంతో కన్సల్టెంట్ జుడిష్ రాజ్‌ను తొలగించామని ఆ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి పూనం మాలకొండయ్య ఒక ప్రకటనలో తెలిపారు. తప్పుడు ప్రచారం చేస్తున్న అతనిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే మెడ్‌టెక్ జొన్ నిర్మాణానికి సంబంధించి అంచనా వ్యయం 500 కోట్ల నుంచి 2346 కోట్ల రూపాయలకు పెంచడం గురించి ఆ ప్రకటనలో ప్రస్తావించకపోవడం గమనార్హం.