తెలంగాణ

పాదయాత్రను ఆపే ప్రసక్తి లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఆగస్టు 10: ప్రతిపక్ష నేతగా బాబ్లీ ప్రాజెక్టుపై పోరాడటానికి కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళిన చంద్రబాబు ఏ విధమైన అనుమతులు తీసుకున్నారో చెప్పాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం కిర్లంపూడిలోని తన స్వగృహంలో గురువారం ముద్రగడ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పే అబద్ధాలకు కాపు జాతి యావత్తూ సిగ్గుపడుతోందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని కాపులందరూ ఉద్యమంలో భాగస్వాములయ్యారని, అందరి కృషి, శ్రమతో ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళాల్సి వుందన్నారు. గ్రామస్థాయిలో ఇకనుండి ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని ప్రకటించారు. ఉద్యమంలో వెనుకంజవేస్తే కాపు సామాజికవర్గ పిల్లల భవిష్యత్ సర్వనాశనమయ్యే ప్రమాదం ఉందన్నారు. ఉద్యమాన్ని అణచివేయాల్సిందిగా ముఖ్యమంత్రి పోలీసులను ఆదేశించారంటే ఇది ప్రజాస్వామ్యమా? రాచరికమా? అని ప్రశ్నించారు. చిన్న పిల్లలను కూడా పోలీస్ స్టేషన్లకు పిలిపించి కౌనె్సలింగ్ చేసి, రౌడీషీట్లు తెరుస్తున్నారని వాపోయారు. చలో అమరావతి పాదయాత్ర ఎట్టి పరిస్థితుల్లో చేసితీరతామని, చావోరేవో తేల్చుకుంటామని చెప్పారు. జూలై 26న పాదయాత్రకు ప్రయత్నించగా అడ్డుకున్నారని, అందుకే నిరవధిక పాదయాత్ర అని ప్రకటించినట్టు పేర్కొన్నారు. తాను చలో అమరావతి అని ఎలా పిలుపునిచ్చానో, మీరు చలో కిర్లంపూడి అంటూ కదలండి అని పిలుపునిచ్చారు. కాపులది తాటాకు మంట కాదని, కాలే తుమ్మ కర్ర వంటిదని చాటి చెప్పాలని కాపు సామాజికవర్గానికి పిలుపునిచ్చారు. ఈ మంట చంద్రబాబును కుర్చీ నుండి కదిపే స్థాయిలో ఉండాలన్నారు. రిజర్వేషన్ల సాధనకు ఇవే ఆఖరు ఘడియలని అన్నారు. వివిధ జిల్లాల నుండి వచ్చిన కాపు ప్రతినిధులు ముద్రగడకు మద్దతు తెలిపారు.