ఆంధ్రప్రదేశ్‌

ఏలేరు రెండో దశకు టెండర్ల ఆహ్వానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 14: ఏలేరు రెండవ దశ ఆధునికీకరణ పనులకు టెండర్లు పిలిచారు. మొదటి, రెండవ దశలు కలిపి మొత్తం రూ.238 కోట్లతో ఆధునికీకరణ పనులు చేపట్టారు. తొలి ఆధునికీకరణలో రూ.108 కోట్లతో టెండర్లు పిలవగా, అందులో రూ.98 కోట్లు విలువైన పనులు చేపట్టారు. ఈ పనులు దాదాపు 20 శాతం పూర్తయ్యాయి. ఇందులో ప్రధానంగా రూ.54 కోట్ల వరకూ హెడ్‌వర్క్స్‌వి ఉన్నాయి. రెండవ దశలో రూ.130 కోట్లతో పనులు చేపడుతున్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఇదిలా ఉండగా..రబీలో స్టాండింగ్ క్రాఫ్‌లకు నీరందించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో జలవనరుల శాఖ అధికారులు తాత్కాలిక ఆలోచనా విధానాన్ని అనుసరించి కిర్లంపూడి మండలం సోమవరం, కృష్ణవరం గ్రామాల వద్ద పుష్కర కాలువ నుండి గోదావరి జలాలను ఏలేరు నదిలో కలిపారు. దీంతో గోదావరి ఏలేరులో అనుసంధానమైనట్టు అయింది. ఆ మాటకొస్తే గోదావరి జలాలు డిస్కో పైపులైను ద్వారా విశాఖ పారిశ్రామిక అవసరాలకు తీసుకువెళ్లే కాలువలోకి మళ్లించడం ద్వారా ఏనాడో అనుసంధానమైనట్లు లెక్క. ఇది కాకుండా శాశ్వత ప్రాతిపదికన జలవనరుల శాఖ అధికారులు ఏలేరు, పాములేరులను గోదావరి జలాలతో అనుసంధానమయ్యే పథకాలను కూడా ఆలోచన చేస్తున్నారు. కాటన్ జయంతిని పురస్కరించుకుని ఆదివారం రాజమహేంద్రవరంలో జరగబోయే జలవనరుల నిపుణుల సదస్సులో ఈ విషయాన్ని తేటతెల్లం చేయనున్నట్టు సమాచారం. నదుల అనుసంధానంలో భాగంగా ఈ ప్రాజెక్టుల రూపకల్పన జరిగింది. పాములేరు నుండి గోదావరి నీటిని ఏలేరుకు మళ్లించే విధానంపై రూపకల్పన జరగుతోంది. పోలవరం ఎడమ కాలువ నుండి ఏలేరుకు గోదావరి అనుసంధానానికి శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మూడు చోట్ల జాతీయ రహదారిపై వంతెనలు, నదిని ఆనుకుని ఎడమ కాలువ మొదట్లో ఆరు కిలోమీటర్ల మేర తవ్వకం, రూ.30 లక్షలు ఖర్చుచేస్తే ఒక చోట లిఫ్ట్ పెట్టినా ఇప్పటి నుండే రబీకి కూడా శాశ్వత ప్రాతిపదికన సాగునీరు అందజేసే అవకాశం కలగనుందని నిర్ధారించారు. ప్రస్తుతం ఆ దిశగా జలవనరుల శాఖ ఆలోచనలు కార్యరూపం దాలుస్తున్నాయి. ఇప్పటికే డీప్ కట్ ద్వారా పుష్కర కాలువను ఏలేరులోకి పంపించారు. ఏలేరు కింద 38వేల ఎకరాలకు ఈ మారు గోదావరి జలాలను అందించినట్లయింది. విశాఖ స్టీల్ ప్లాంటుకు 150 క్యూసెక్కులు గోదావరి నుండి, 120 క్యూసెక్కులు ఏలేరు నుండీ అందిస్తున్నారు. ఇందులో నికరంగా అక్కడకు వెళ్లేసరికి 150 క్యూసెక్కులే మిగులుతున్నాయి. ఏలేరు డెడ్ స్టోరేజ్‌కు చేరుకోవడంతో విశాఖ స్టీల్ ప్లాంటుకు నీరివ్వలేని పరిస్థితిగానీ ఎదురైతే రూ.1500 కోట్లు నష్టం వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి పంపుల ద్వారా నీరుతోడి లిఫ్ట్‌ద్వారా ఏలేరు కాలువ నుండి నీరు పట్టుకెళ్లుతున్నారు. మొత్తంపై ఈ ఏడాది జలవనరుల శాఖ ప్రత్యేక దృష్టి సారించి ఇటు ఏలేరు, అటు పుష్కరం నుండి జలాలను అందించేందుకు చర్యలు చేపట్టినట్టు ఎస్‌ఇ సుగుణాకరరావు తెలిపారు. కాటన్ జయంతిని పురస్కరించుకుని జరిగే టెక్నికల్ సదస్సులో వాగులు, నదుల అనుసంధానంపై ప్రత్యేక ఇంజనీరింగ్ ఆలోచనలను జల వనురుల శాఖ ఆవిష్కరించనున్నట్టు తెలిసింది.