ఆంధ్రప్రదేశ్‌

‘తిలక్ కర్తవ్య బోధ మనకు ప్రేరణ కావాలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కల్చరల్), ఆగస్టు 14: తరతరాలకు సరిపడ స్ఫూర్తిని ఇవ్వగల తిలక్ దేశ భక్తి మనకు ప్రేరణ కావాలని ఆంధ్రభూమి మాజీ సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ అన్నారు. నగరంలోని బిఆర్‌టిఎస్ రోడ్డు మీద స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం రాత్రి అమరావతి ఉత్సవ సమితి భారతమాతకు పూజా కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో శాస్ర్తీ లోకమాన్య బాలగంగాధర్ తిలక్‌పై స్మారకోపన్యాసం చేస్తూ లక్షల మందిని వీధుల్లోకి తీసుకొచ్చి జాతీయ ఉద్యమం నడిపించిన ఘనత తిలక్‌కే దక్కుతుందన్నారు. దేశ ప్రజలను మభ్యపెట్టేందుకు జాతీయ కాంగ్రెస్ అనే సంస్థను బ్రిటీష్ వారు స్థాపించారన్నారు. బ్రిటీష్ వాళ్లకు దయ కలిగేవరకు భారతీయులందరూ అణిగిమణిగి ఉండాలనే విధంగా ఆ సంస్థ ద్వారా బ్రిటీష్ వారు వ్యాప్తి చేశారన్నారు. ఆ సమయంలో బాలగంగాధర్ తిలక్ దానిని ఖండించి తాము ఎందుకు అణిగిమణిగి ఉండాలంటూ ఉద్యమాన్ని చేపట్టి అందరిలో సమైక్యతా భావాన్ని తీసుకొచ్చేందుకు ఆయన ఇంటి వద్దనే స్వదేశీ ఉత్పత్తులతో స్టాల్స్ ఏర్పాటు చేయటం, గణేష్ ఉత్సవాలు, ఛత్రపతి శివాజీ ఉత్సవాలను ప్రారంభించారన్నారు. ఆయనను స్మరించుకోవటం మన కర్తవ్యమన్నారు.
అవార్డుల ప్రదానం
స్వాతంత్య్రం నా జన్మహక్కు అని గర్జించిన లోక్‌మాణ్య బాలగంగాధర్ పేరిట దేశ హింతం కోసం పని చేస్తున్న వివిధ రంగాల్లోని ప్రముఖులను వేదికపై సత్కరించారు. వివిధ రంగాలకు చెందిన శ్రీకాకుళం జిల్లాలోని దుంగనపట్ట గ్రామం ఆదర్శ గ్రామంగా, వివేకానంద్ మహాయోగి ఆరోగ్య కేంద్రం (రాజమండ్రి) రైతు నేస్తం ఫౌండేషన్ (వ్యవసాయం) గుంటూరు జిల్లా రక్షణ విభాగం నుండి సూర్యప్రకాష్ కుటుంబీలకు అవార్డులను ప్రదానం చేశారు.
కాగడాల ర్యాలీ
భారతమాతాకు జై అనే నినాదాలు ఇస్తూ జాతీయ జెండాలతో ప్రారంభంలో వందల మంది దేశ భక్తులు, దేశాభిమానులు కాగడాల తీసుకుని వేదిక వరకు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం అర్ధరాత్రి దాటిన తరువాత టపాసులతో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షుడుగా ఉత్సవ సమితి అధ్యక్షుడు ముత్తవరపు మురళీకృష్ణ వ్యవహరించగా నరసాపురం ఎంపి గొకరాజు గంగరాజు, తొండపు హనుమంతరావు, యాబలూరి లోకనాథశర్మ, రామసాయి, జిడివి ప్రసాదరావు, దాసం ఉమామహేశ్వరరాజు, కుమారస్వామి, లంకా వెంగళరావుయాదవ్, వేముల హజరత్తయ్యగుప్తా తదితరులు పాల్గొని భారతమత చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి అంజలి ఘటించారు.