ఆంధ్రప్రదేశ్‌

శ్రీశైలంలో పోటెత్తిన భక్తజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, ఆగస్టు 14: శ్రావణ సోమవారం, వరుస సెలవుల నేపధ్యంలో ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో శ్రీగిరి కిటకిటలాడుతోంది. వేలాదిగా తరలిస్తున్న భక్తులను దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు దర్శన వేళల్లో మార్పులు చేశారు. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు సైతం చేపట్టారు. వేకువ జామున 3.30 గంటలకే ఆలయ ద్వారాలు తెరిచి ప్రాతఃకాల పూజల అనంతరం భక్తులను దర్శనానికి, ఆర్జిత సేవలకు అనుమతిస్తున్నారు. క్యూలైన్లలో భక్తులకు అల్పాహారం, మంచినీరు అందిస్తున్నారు. ఉదయం 9.30 గంటల నుండి నిత్యన్నదాన భవనంలో నిరంతరంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శ్రావణ సోమవారాన్ని పురస్కరించుకుని మల్లికార్జునస్వామి, భ్రమరాంబిక అమ్మవార్లకు సహస్త్ర దీపార్చన సేవను ఆలయ అర్చక స్వాములు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వెండిరథంపై ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చక స్వాములు, వేదపండితులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.