ఆంధ్రప్రదేశ్‌

అభివృద్ధి అంటే కూల్చివేతలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, ఆగస్టు 14: ఉప ఎన్నికకు ముందు చంద్రబాబునాయుడు ఒక్కసారైనా నంద్యాలకు వచ్చారా, ఉపఎన్నిక రావడం, వైకాపా పోటీ పెట్టడంతో బాబు నంద్యాల చుట్టూ తిరుగుతున్నారని వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాల పట్టణంలో సోమవారం నిర్వహించిన రోడ్‌షోలో జగన్ మాట్లాడుతూ వైకాపా పోటీని తట్టుకోలేక రాష్ట్ర క్యాబినెట్ అంతా నంద్యాలలో తిష్టవేసిందని, చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు సామాజిక వర్గాలను బుజ్జగించేపనిలో ఉన్నారన్నారు. మాట వినకపోతే వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. మూడున్నరేళ్లలో చంద్రబాబు ఒక్క హామీనైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు. గతంలో రేషన్ షాపుల్లో ఇస్తున్న వస్తువులన్నీ మాయమై నేడు బియ్యం మాత్రమే మిగిలాయన్నారు. చంద్రబాబు హయాంలో అభివృద్ధి శూన్యం అన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా రోడ్ల విస్తరణ జరుగుతుంది, అది అభివృద్ధి కాదు. ఎవరినీ అడగకుండా షాపులు, ఇళ్లను కూల్చేయడం మంచిది కాదన్నారు. నంద్యాలలో గజం రూ.1.10 లక్షలు పలుకుతోందని, సెంటు స్థలం రూ.50 లక్షలు ఉందని, చంద్రబాబు రాత్రికిరాత్రి విస్తరణ పేరుతో భవనాలు కూల్చేసి గజానికి రూ.18 వేలు ఇస్తానంటున్నారని, ఇదెక్కడి న్యాయం, ఇదా అభివృద్ది అంటే అని ప్రశ్నించారు. భవనాలు కూల్చేయడం, రోడ్లు తవ్వడం అభివృద్ధి కాదు, రైతులు, పేదల ముఖాల్లో చిరునవ్వు చూడడమే నిజమైన అభివృద్ధి అని అన్నారు. ఇళ్లు కట్టేందుకు అడుగుకు రూ.వెయ్యి ఉంటే చంద్రబాబు మాత్రం కాంట్రాక్టర్లకు రూ.2,778 ఇవ్వడం సహేతుకమా అని నిలదీశారు. చంద్రబాబునాయుడు పేదలను సైతం వదిలి పెట్టడం లేదన్నారు. అక్రమ డబ్బుతో చిన్నస్థాయి నాయకులను కొంటున్నారన్నారు. బాబు మోసాలకు ప్రజలు వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. నంద్యాల తీర్పు జరుగబోయే మార్పుకు నాంది కావాలన్నారు. నంద్యాల ఓటర్లు ధర్మానికి ఓటు వేయండి, న్యాయాన్ని గెలిపించండి అన్నారు. బాబులా తన వద్ద డబ్బు, అధికారం, పోలీసులు, దుర్భుద్ది లేవని, లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా చూపే ఛానళ్లు, పేపర్లు లేవన్నారు. నంద్యాల ప్రజలకు అండగా ఉంటా, ఒక్క అవకాశం ఇస్తే నాన్న గారిలా అందరి గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటానని జగన్ అన్నారు.

చిత్రం.. నంద్యాల పట్టణంలో సోమవారం రోడ్‌షోలో మాట్లాడుతూన్న జగన్