ఆంధ్రప్రదేశ్‌

అమరావతిలో మరో ప్రతిష్ఠాత్మక సంస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 15: రాజధాని అమరావతి పరిధిలోని నవులూరు రెవెన్యూ ఎర్రబాలెం దగ్గర ఏర్పాటు చేయనున్న లండన్ కింగ్స్ కాలేజ్ హాస్పటల్, ఇండో- యూకే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెడిసిటీకి ఆగస్టు 16 బుధవారం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందని ఏపి సిఆర్‌డిఏ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీ్ధర్ ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ వెటర్నరీ కాలనీలోని ద వెన్యూ కనె్వన్షన్ సెంటర్‌లో నిర్వహించే ఈ కార్యక్రమంలో అతిధులుగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి జేపి నడ్డా, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్, యూకె పార్లమెంట్ మెంబర్ ఆండ్రూ మిశ్చల్, లండన్ కింగ్స్ కాలేజ్ హాస్పిటల్ చైర్మన్ లార్డ్ రాబర్ట్ కెర్సలాకే, ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, కొల్లు రవీంద్ర, గంటా శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, విజయవాడ నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్, గుంటూరు ఎంపి గల్లా జయదేవ్, విజయవాడ ఎంపి కేశినేని శ్రీనివాస్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పాల్గొంటారు.