ఆంధ్రప్రదేశ్‌

హోదాను కేంద్రం వద్ద తాకట్టు పెట్టిన బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, ఆగస్టు 15: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విఫలమయ్యారని వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. హోదాను కేంద్రం వద్ద తాకట్టుపెట్టిన ముఖ్యమంత్రి మీ వద్దకు వస్తాడని, ఆయన కాలర్ పట్టుకుని నిలదీయాలని అన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం నంద్యాల పట్టణంలో జగన్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా మెలిగిన బాబు ప్రత్యేక హోదా సాధించలేకపోయారన్నారు. తన స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజలను నిలువునా ముంచారన్నారు. ఐదు కాదు పది కాదు 15ఏళ్లు హోదా కావాలన్న బాబు దాన్ని మరచి పక్క రాష్ట్రంలో ఎమ్మెల్యేలను కొంటూ అడియో, వీడియోలో అడ్డం గా దొరికిపోయారని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించి ఉంటే పన్నుల రాయితీతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంటు వల్ల అభివృద్ధి వేగంగా జరిగేదన్నారు. అంతేగాక ఇతర రాష్ట్రాలు, దేశాల నుండి పరిశ్రమలు వచ్చేవని ఫలితంగా నిరుద్యోగ యువతకు లక్షల సంఖ్యలో ఉద్యోగాలు దొరికేవన్నా రు. వీటినన్నంటినీ విస్మరించి ప్రజలను మోసం చేయడం తప్పు కాదా, తప్పు చేసిన వారిని దండించరా అని ప్రశ్నించారు. సార్వత్రిక ఎన్నికల ముందు రైతులకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి వారు చేసిన అప్పులపై వడ్డీకూడా ఇవ్వలేకపోయాడన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అరకొరగా ఇచ్చిన రుణమాఫీ మొత్తాన్ని వడ్డీ కిం ద జమ చేసుకున్న బ్యాంకర్లు రైతుల కు మొండి చేయి చూపించాయన్నా రు. పొదుపు రుణా లు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి మోసం చేసిన చం ద్రబాబును ఏవిధంగా శిక్షిస్తారని మహిళలను ప్రశ్నించారు.

చిత్రం.. నంద్యాల పట్టణంలో నిర్వహించిన రోడ్ షోలో ప్రసంగిస్తున్న జగన్