ఆంధ్రప్రదేశ్‌

అంతు చిక్కని నంద్యాల ఓటరు నాడి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఆగస్టు 15:‘మేమే గెలుస్తాం.. అత్యధిక మెజారిటీ కోసమే పని చేస్తున్నాం.. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి ఆశలు వదులుకోవాల్సిం దే..’ ఇవి నంద్యాల శాసనసభా స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికలో నాయకుల నోటి నుంచి వస్తున్న మాటలు. కార్యకర్తల మనోధైర్యం సడలకుండా ఉండేందుకు రెండు ప్రధాన పార్టీల నాయకులు, అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నా అంతర్గతంగా మాత్రం విజయంపై ఇరు పార్టీల అభ్యర్థులకు ఇంకా నమ్మ కం కుదరని పరిస్థితి నంద్యాలలో కనిపిస్తోంది. బహిరంగ ప్రకటనల్లో ధీమా వ్యక్తం చేస్తూ జబ్బలు చరుస్తున్న నాయకులు గదుల్లోకి చేరుకుని తలుపులు వేసుకుని ఆత్మీయులతో మాత్రం గెలవడానికి ఉన్న మార్గాలేంటన్న విషయమే ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం. ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల అవుతుందన్న విషయం తెలిసిన వెంటనే నంద్యాల అభివృద్ధిపై శరవేగంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేసిన ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదలయ్యాక సైతం ఆయా అభివృద్ధి పనులు ఆగకుండా చూస్తోంది. మరోవైపు నియోజకవర్గంలోని గ్రామాలు, పట్టణంలోని అన్ని వార్డుల్లో వ్యక్తిగత సంక్షేమ పథకాలు అందని పేదలకు వాటిని అందించి ఇప్పుడు ఓటేమయని అడుగుతున్నారు. గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నాయకుల వరకూ ఏదో రకంగా తమకనుకూలంగా పని చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంది. ఇప్పటికే సిఎం చంద్రబాబు రెండు దఫాలు నంద్యాలలో పర్యటించి అభివృద్ధి పనులు, వ్యక్తిగత సంక్షేమ పథకాలపై అధికారులతో సమీక్షించారు. నోటిఫికేషన్ విడుదలయ్యాక ఆయన పార్టీ అధ్యక్షుడి హోదాలో ఈనెల 19వ తేదీ ప్రచారం కోసం వస్తున్నారు. ఇక సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బుధవారం నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నా రు. ప్రభుత్వంలోని మంత్రులు దఫదఫాలుగా నంద్యాల వచ్చి ప్రచారం చేసి వెళ్తున్నారు. ఇంత జరుగుతున్నా పార్టీ నేతలు మాత్రం విజయంపై లోలోన మదనపడుతూనే ఉన్నట్లు అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది. వైకాపా అభ్యర్థి శిల్పా మోహనరెడ్డి తనకంటూ వ్యక్తిగతంగా ఓటు బ్యాంకును ఏర్పరచుకోవడం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు, యువత జగన్‌పై అభిమానం చూపడం వంటి అంశాలు వారిని ఆందోళనకు గురిచేస్తుండగా మరోవైపు యువ ఓటర్లను ఆకర్శించే శక్తి కలిగిన సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ ఇంకా తన మద్దతు ప్రకటించకపోవడం కూడా టిడిపి నేతల భయానికి కారణమవుతున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది. ఇక వైకా పా పరిస్థితి సైతం ప్రత్యర్థి పార్టీ తరహాలోనే ఉంది. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ గత వారం రోజులుగా నంద్యాలలో తిష్టవేసి ప్రచారం నిర్వహిస్తున్నా టిడిపి నేతల క్షేత్రస్థాయి పని తీరు వారిని ఇబ్బందులకు గురిచేస్తోంది. నా అనుకున్న ఒకరిద్దరు నాయకులు వైకాపాను వీడి టిడిపి పంచన చేరడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ముస్లిం మైనారిటీ ఓట్లపై గంపెడాశ పెట్టుకున్న వైకాపా నేతల ఆశలపై నీళ్లు చల్లుతూ ఆ వర్గంపై టిడిపి ప్రధాన దృష్టి సారించడం, కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి అదే వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఓట్ల చీలికపై ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఇక పవన్‌కళ్యాణ్ మద్ద తు ప్రకటిస్తే మరింత ఆందోళనకు గురి కావ డం ఖాయమన్న చర్చ సాగుతోంది.
నంద్యాలలో జాతీయ పతాకాన్ని
ఆవిష్కరించిన జగన్
ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాలలో ఉన్న వైకాపా అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి మంగళవారం ఇక్కడే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పట్టణంలోని బొమ్మలసత్రం ప్రాం తంలో జగన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పావురాలను ఎగురవేశారు.