ఆంధ్రప్రదేశ్‌

నంద్యాల ఉపఎన్నిక నిలిపివేతకు జగన్ కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 15: నంద్యాలలో ఉపఎన్నిక జరక్కుండా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అలజడి సృష్టిస్తున్నారని రాష్ట్ర మంత్రులు ధ్వజమెత్తారు. మంగళవారం సాయంత్రం గుంటూరులోని రాష్ట్ర టిడిపి కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో బలహీనవర్గాలశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, గిరిజన, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనంద్ బాబు, విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఓటమి భయంతో జగన్ నంద్యాలలో అల్లర్లను ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో తెలుగుదేశం విజయం ఖాయమని, 29వ తేదీ తరువాత వైసిపి జెండా తిప్పేస్తారని ధీమా వ్యక్తంచేశారు. ఎన్నికలను అడ్డుకునేందుకు జగన్ నంద్యాలలో తిష్టవేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. తక్షణమే ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని ఆయన్ను హైదరాబాద్ తిప్పిపంపాలని విజ్ఞప్తి చేశారు. దోచుకున్న డబ్బును ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారన్నారు. అవినీతి డబ్బు జగన్ వద్ద ఉందని సిబిఐ తేల్చిచెప్పిన సంగతి ప్రజలకు తెలుసన్నారు. హైదరాబాద్‌లో ఉంటూ చుట్టం చూపుగా రాష్ట్రానికి వచ్చి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. ఓటర్లను డబ్బుతో ప్రలోభపెట్టి టిడిపిపై బురదజల్లుతున్నారన్నారు. నంద్యాల ప్రజలు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చార న్నారు. ఎన్నికల సమయంలోనే జగన్‌కు నంద్యాల సమస్యలు గుర్తుకు వచ్చాయా అని ప్రశ్నించారు. ప్రభుత్వం తరఫునన మంత్రులు మకాం వేసి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును పర్యవేక్షిస్తుంటే జగన్ పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు. కడప, పులివెందుల నుంచి రౌడీలు, ఫ్యాక్షనిస్టులను నంద్యాలలో దించారని ఆరోపించారు. కాపులకు బిసి రిజర్వేషన్ అమలుచేసే విషయంలో వైసిపి రెండునాల్కల ధోరణని అవలంబిస్తోందని విమర్శించారు. రిజర్వేషన్లు ఇవ్వలేదని కాపుల్ని, ఇస్తే నష్టపోతారని బిసిలను రెచ్చకొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకోవటం అవివేకమన్నారు. విజయవాడలో జరిగిన సమావేశంలో కాపులకు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలనే ప్రతిపాదన వచ్చిందని, దానిపై త్వరలో ప్రభుత్వం ప్రకటన చేయనున్నట్లు తెలిపారు. బిసి కమిషన్ నివేదిక అందిన వెంటనే ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. బిసిలకు ఎలాంటి అన్యాయం జరక్కుండా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. రిజర్వేషన్లపై స్పష్టత ప్రకటించని వైసిపికి తమ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక అర్హత లేదన్నారు. గత నాలుగు దశాబ్దాలుగా ఎన్నికల్లో కాపులను బలిపశువులు చేశారని గుర్తించే ముఖ్యమంత్రి చంద్రబాబు రిజర్వేషన్ ప్రకటించారని, కచ్చితంగా ఇది కార్యరూపం దాల్చగలదనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రిజర్వేషన్లపై తప్పుడు సమాచారాన్ని కాపు కులస్థులు నమ్మ వద్దని కోరారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే నంద్యాల ఎన్నికల్లో విజయానికి సంకేతాలన్నారు.