ఆంధ్రప్రదేశ్‌

నవ్యాంధ్ర నిర్మాణానికి పునరంకితమవుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 15: దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన మహానుభావుల స్ఫూర్తితో నవ్యాంధ్ర నిర్మాణానికి ఉద్యోగులు పునరంకితం కావాలని ఏపి ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు పి అశోక్‌బాబు పిలుపునిచ్చారు. 71వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ గాంధీనగర్‌లోని ఏపి ఎన్జీవో హోం రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బ్రిటీష్ పాలకుల దాస్య శృంఖలాల నుండి ప్రజలను విముక్తుల్ని చేసేందుకు స్వాతంత్య్రం కోసం ఎందరో మహానుభావులు ప్రాణాలను, ఆస్తులను త్యజించారన్నారు. వారి మనస్సులో ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండా కేవలం దేశ ఔన్నత్యాన్ని, ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్య్రం సముపార్జించేందుకు అవిరళ పోరాటాలు చేశారన్నారు. అలాంటి త్యాగధనులను స్ఫూర్తిగా తీసుకుని ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణ పట్ల అంకితభావంతో సేవలు అందించాలని అశోక్‌బాబు కోరారు. కార్యక్రమంలో ఎన్జీవో సంఘ నాయకులు ఎండి ఇక్బాల్, డి సత్యనారాయణరెడ్డి, కోనేరు రవి, డి సుజాత, హేమకళ్యాణి, పెన్షనర్ల అసోసియేషన్ అధ్యక్షుడు కె దాలినాయుడు, మాజీ అధ్యక్షుడు నారాయణరావు, రాజారావు పాల్గొన్నారు.