ఆంధ్రప్రదేశ్‌

నంద్యాలలో ధన ప్రవాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 17: ఓటమి భయంతో సిఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పోటాపోటీగా కోట్లాది రూపాయల అక్రమార్జిత సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికలు ప్రశాంతంగా నిబంధనల కనుగుణంగా జరిగితే దిమ్మతిరిగే ఫలితాలు రాగలవన్నారు. నంద్యాల ఉప ఎన్నికను రద్దుచేయాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. విజయవాడలోని ఏపిసిసి కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటికే మూడుసార్లు పర్యటించారన్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి గత పది రోజులుగా అక్కడే మకాం వేసి ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే కోట్లాది రూపాయలు ఖర్చయ్యాయని అన్నారు. అక్కడ ప్రజలు మర్చిపోయిన ఫ్యాక్షనిజాన్ని నేతలు ప్రోత్సహిస్తున్నారని అన్నారు. చెన్నై ఆర్‌కె నగర్‌లో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారనే అభియోగంపై ఎన్నిక రద్దు చేశారన్నారు. అయితే నంద్యలలో దానికంటే అనేక రెట్లు ఖర్చవుతున్నదన్నారు. పైగా అధికార దుర్వినియోగం, కులాలవారీ సమావేశాలు, రెచ్చగొట్టే ప్రసంగాలు ఇలా సాగుతున్నప్పుడు నంద్యాల ఉప ఎన్నికను ఎందుకు రద్దు చేయరాదని రఘువీరారెడ్డి ప్రశ్నించారు.

చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి